సర్పంచ్ ఎవరు గెలిచినా గ్రామానికి రావాల్సిన నిధులు ఆగవు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచ్ ఎవరు గెలిచినా గ్రామానికి రావాల్సిన నిధులు ఆగవు.ఇది ఎవరి కృప, ఎవరి పార్టీ అనుగ్రహం కాదు — ఇది మన రాజ్యాంగ హక్కు,భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243H మరియు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018, గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వడం ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన బాధ్యత.పార్టీ చూసి, సర్పంచ్ చూసి నిధులు ఆపడం చట్టవిరుద్ధం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.చాలామంది “అధికార పార్టీ సర్పంచ్ ఉంటేనే గ్రామం అభివృద్ధి అవుతుంది” అని ప్రచారం చేస్తారు. అది ప్రజలను భయపెట్టడానికి చేసే రాజకీయ ట్రిక్ తప్ప వాస్తవం కాదు.గ్రామం ఎలా ముందుకు వెళ్తుందో నిర్ణయించేది పార్టీ కాదు – ప్రజల ఇష్టం, ప్రజల ఐక్యత, ప్రజల అభివృద్ధి దిశ.15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా గ్రామ ఖాతాల్లో జమ అవుతాయి.సెంటర్ గానీ, స్టేట్ గానీ సర్పంచ్ పార్టీ చూసి ఫండ్స్ ఆపలేరు.
