నవాబుపేట/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని మండలం కాకర్లపాడ్ గ్రామ రెవెన్యూ శివారులో వెలసిన పర్వతపూర్ (ఫతేపూర్) మైసమ్మ దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార గురువారం అట్టహాసంగా జరిగింది. దేవాలయ నూతన
చైర్మన్ గా జగన్ మోహన్ రెడ్డి, మరో 9 మంది కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా..ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ… మైసమ్మ తల్లి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు.
అవినీతి చేయకుండా నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.