తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలంచీర్లవంచ గ్రామంలో ఎల్లారెడ్డిపేట్ అశ్విని హాస్పిటల్ వారి సౌజన్యంతో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇక్కడ హెల్త్ సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని గత పాలకులు చేసిన పాపానికి ఇక్కడ ఉన్న హెల్త్ సెంటర్ వేములవాడకు తరలించా రానీ ఉద్యమ సమయం నుండి చీర్లవంచ గ్రామానికి నాకు అభినవ సంబంధాలు ఉన్నాయని గత బి ఆర్ ఎస్ పాలనలో చీర్లవంచ గ్రామం నిరాదరణకు గురైందని మిడ్ మానేరు నిర్మాణంలోని మీ త్యాగాలు వెలకట్ట లేనిదని గత ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని విలక్షణమైన తీర్పు ఇచ్చారని ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని మీ సాధక బాధలు తెలుసు కాబట్టి మీకు అండగా ఉండడానికి మీ ఊరికి వచ్చానని వైద్యం చేసుకోవడానికి పట్టణానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసు అందుకే ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతూరు భాస్కర్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగు మహేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆరేపల్లి బాలు పొన్నాల పరుశురాం గంగు కొమురయ్య ప్రతినిధులు రాము జలంధర్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ మునిగల రాజు తిరుపతి రెడ్డి బాలసాని శ్రీనివాస్ ప్రసాద్ అశ్విని హాస్పిటల్ డాక్టర్ బృందం ప్రజలు తదితరులు పాల్గొన్నారు