వనపర్తి జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్ ల కు నూతన అక్రెడేషన్ కార్డులు జారీ
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్ కార్డు ఇస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లాలో మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు జరిగిందని కలెక్టర్ తెలిపారు గత ప్రభుత్వ జి ఓ 239 ప్రకారం 2022 లో జారీచేసిన అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి ఏప్రిల్ 30 తో ముగుస్తు oదని కలెక్టర్ పేర్కొన్నారు మే 1న 2 సంవత్సరాల కాల పరిమితితో జర్నలిస్టు లకు కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు 12 న
సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మాత్రమే మొదటి అక్రిడేషన్ జాబితా కింద పరిగణనలోకి తీసుకొని జిల్లా కమిటీ ద్వారా పరిశీలన చేసి అర్హులైన జర్నలిస్టులకు నిర్ణీత గడువు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి రెండవ జాబితలో పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు
