కూల్చుకుంటారా! కూల్చమంటారా!!

https://epaper.netidhatri.com/view/359/netidhathri-e-paper-27th-aug-2024

‘‘రో హౌస్‌’’ గద్దలకు మున్సిపల్‌ నోటీసులు.

-‘‘నేటిధాత్రి’’ తో గద్దల పుట్టలు బద్దలు!

-‘‘నేటిధాత్రి’’ సాధించిన అక్షర విజయం.

-కార్మికులకు జరిగిన అన్యాయంపై ‘‘నేటిధాత్రి’’ అక్షర సమరం.

-ఎన్ని అవరోధాలెదురైనా వెనక్కి తగ్గని ‘‘నేటిధాత్రి’’ అక్షర పోరాటం.

-అడుగడుగునా ఎదురైన అవాతంతరాలను అక్షరాలతో తిప్పి కొట్టిన వైనం.

-గద్దలకు ప్రశ్న లేకుండా చేసిన ‘‘నేటిధాత్రి’’అక్షర గాండీవం.

-బెదిరింపులను కూడా లెక్క చేయక ఎదిరించి నిలిచిన ‘‘నేటిధాత్రి’’ అక్షరం.

-ఇలాంటి వార్తలు లక్షలు చూశామని హేళన చేసిన గద్దల పైత్యం.

-‘‘నేటిధాత్రి’’ని రాత్రిలో కలిపేస్తామన్న గద్దల గూండాయిజం.

-‘‘రో హౌస్‌’’ ల కూల్చివేతకు రంగం సిద్ధం.

-త్వరలో ‘‘రో హౌస్‌’’ లు నేలమట్టం.

-‘‘నేటిధాత్రి’’కి అభినందన వెల్లువ.

-మీడియా వర్గాల నుంచి ‘‘నేటిధాత్రి’’కి అందిన శుభాకాంక్షలు.

-చిత్రపురిలో గద్దల ఊడలమర్రి!

-‘రో హౌస్‌’’ ల పేరుతో జొరబడిరి

-కార్మికుల కష్టం దోచుకునిరి.

-చీమల్లాంటి కార్మికుల పొట్టకొట్టిరి.

-పాముల్లా మారి పుట్టలో దూరిరి.

-కూల్చివేతలతో ఉక్కిరిబిక్కిరి.

-అమాయకుల ఉసురుపోసుకుంటే అంతే మరి.

-నోటీసులే కాదు, ‘‘రో హౌస్‌’’ లు నేలమట్టమైన నాడే అసలు విజయం.

-చిత్రపురిలో కార్మికులందరికీ సొంత ఇంటి కల నెరవేరిన నాడే అసలు వేడుక.

-అప్పటి వరకు నేటిధాత్రి అక్షర పోరాట ప్రయాణం ఆగదు.

-కార్మికుల కల నెరవేర్చే దాక నేటిధాత్రి పోరు ఆగదు.

-న్యాయమైన కార్మికుల పక్షాన పోరు ‘‘నేటిధాత్రి’’ ఆపదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నేటిధాత్రి అక్షర విజయంలో కలికితురాయి చిత్రపురి రోహౌజ్‌లపై పోరాటం. నేటిదాత్రి ఆశించిన రోజు, పోరాటానికి విజయం దక్కిన రోజు రానే వచ్చింది. చిత్రపురిలో రోహౌజ్‌ల నిర్మాణం అక్రమం. దుర్మార్గం. వాటిని ఆపేందుకు శతవిదాల నేటిధాత్రి అనేక సార్లు ప్రయత్నం చేసింది. అంతిమంగా నేటిధాత్రి అక్షరం విజయం సాధించింది. తాజాగా ఓ ఆరు రోహౌజ్‌ల కూల్చివేతలో సినీ గద్దల పుట్టలు బద్దలయ్యాయి. ఇక చిత్రపురిలో అక్రమంగా నిర్మాణం జరిగిన రోహౌజ్‌లను కూల్చుకుంటారా? లేక మమ్మల్నే కూల్చమంటారా? అంటూ మణికొండ మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఆ లోపు అక్రమ నిర్మాణాలను స్వయంగా ఆక్రమణ దారులే తొలగించుకోవాలి. లేకుంటే బుల్డోజర్లు వస్తాయి. క్షణాల్లో నేల మట్టం చేస్తాయి. కార్మికుల కోరిక నెరవేరుతుంది. కాని కలలు నెరవేరో రోజు ఇంకా రావాలి. రోహౌజ్‌ల కూల్చివేతలు పూర్తి కావాలి. అక్కడ కార్మికుల కోసం అప్పార్టుమెంట్ల నిర్మాణం జరిగినప్పుడే నేటిధాత్రి అక్షర పోరాటానికి పరిపూర్ణమైన విజయం దక్కినట్లౌవుంది. ఒక రకంగా చెప్పాలంటే నేటిధాత్రి అక్షర సమరంలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇప్పుడే మొదలౌతుంది. రో హౌజ్‌ల కూల్చివేతతోనే కార్మికులకు న్యాయం జరిగినట్లు కూడా. చిత్రపురి సొసైటీలో వున్న కార్మికులందరికీ ఫ్లాట్లు దక్కినప్పుడే నిజమైన విజయం. కార్మికుల జీవితాల్లో అసలైన పండుగ. ఇంతదూరం రావడానికి ఎంతో సమయం పట్టింది. ఏళ్ల తరబడి పోరాటం సాగింది. అందరూ కార్మికులకు అన్యాయం జరిగిందన్నవారే కాని, కలిసి వచ్చిన వారు లేరు. వారి పక్షాన నిరంతర పోరాటం చేసిన వారు ఎవరూ లేదు. సినీ కార్మిక నాయకులు కూడా గద్దల ప్రలోభాలకు లొంగిపోయారు. వారికి కలిసి వచ్చే అవకాశాలను అందుకుంటూ కార్మికులను మోసం చేశారు. కాని మొదటి నుంచి చివరి దాకా కార్మికుల పక్షనా నిలిచింది ఒక్క నేటిధాత్రి మాత్రమే…ఇన్నేళ్లుగా చిత్రపురిపై అలుపెరగని అక్షర పోరు సలిపిన నేటిధాత్రిని సినీ కార్మిక లోకం అభినందించింది. తమకు తోడుగా నిలిచిందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఎక్కే మెట్లు దిగే మెట్లు అన్నట్లు ఎన్ని మీడియా సంస్ధలకు తమ గోడు వినిపించినా పట్టించుకున్నవారు లేదు. అడపా దడపా తప్ప, నిరంతరం కార్మికుల పక్షాన నిలిచిన వారు లేరు. కాని ఒక్క నేటిధాత్రి మాత్రమే ఇంత కాలం నిరంతరం వారి సమస్యలను రాస్తూ వచ్చింది. చిత్రపురిలో జరుగుతున్న కుట్రలను బైట పెడుతూ వచ్చింది. కార్మికులను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ వచ్చింది. కార్మికుల్లో ఆత్మ విశ్వాసం నింపుతూ వచ్చింది. వారికి మనో ధైర్యాన్ని పంచుతూ వచ్చింది. వారిలో నిరాశానిసృహలు ఆవహించకుండా తోడుగా వుంటూ వచ్చింది. అదీ నేటిధాత్రి నిబద్దత. అందుకే కార్మిక లోకానికి చిత్రపురిలో విజయం వరించింది. చిత్రపురి కార్మికులదే అన్నది ప్రపంచానికి తెలిసేలా చేసింది. అందుకే కార్మికుల పాలిట నేటిధాత్రి అక్షర బందువైంది. వారి జీవితాల్లో వెలుగులు నిండాలన్న లక్ష్యంతోనే నిబద్దతను అక్షరాయుధంగా మార్చుకున్నది. ఎట్టకేలకు వారికి ఒక శుభ సంకేతం అందేందుకు నిర్వరామ పోరాటం నేటిధాత్రి సాగించింది.

ఒక దశలో ఇక తమకు న్యాయం జరదన్న దిగులుతో జీవితాలపై నిరాశ నిసృహలు కమ్ముకున్న సమయంలో బాధిత కార్మికులు నేటిధాత్రిని ఆశ్రయించారు.

వారికి జరిగిన అన్యాయం గురించి వివరించారు. వారు పడిన బాధలను వెలుబుచ్చారు. నాటి నుంచి కార్మికుల పక్షాన నేటిధాత్రి అక్షర పోరాటం మొదలు పెట్టింది. ఏనాడైతే తొలు పలుకు రాసిందో, నాటి నుంచి నేటి వరకు వెనుకడుగు వేయలేదు. ఎవరికీ వెరవలేదు. ఎవరికీ తలవంచలేదు. ఎవరి బెదిరింపులకు అదిరిపోలేదు. చిత్రపురిలోని రోహౌజ్‌ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించిన వాళ్లున్నారు. బెదిరించిన వాళ్లున్నారు. నేటిధాత్రి కార్యాలయం మీద దాడి చేస్తామన్నవాళ్లున్నారు. చిత్ర పురి గురించి ఇకపై రాస్తే సహించేది లేదన్న వారున్నారు. ఇలా కొన్నేళ్లుగా సినీ గద్దల నుంచి ఏదో రకమైన హెచ్చరికలు వస్తూనే వున్నా, నేటిధాత్రి అక్షర పోరు ఆపలేదు. న్యాయం కోసం, ధర్మం కోసం, కార్మికుల శ్రేయస్సుకోసం జరిపే అక్షర పోరాటంలో ఏనాటికైనా విజయం దక్కుతుందని, రోహౌజ్‌ల స్ధలం మళ్లీ కార్మికులకు చెందుతున్న నమ్మకంతో ముందుకు సాగింది. చిత్రపురికి పడిన తొలి అడుగు నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి కదలికను నేటిధాత్రి రూస్తూనే వచ్చింది. ఇలాంటి పత్రికలు, వార్తలు చాలా చూశమంటూ హేళన చేసిన సినీ గద్దలున్నారు. నేటిధాత్రి ప్రతినిధులు కనిపిస్తే దాడులు చేయాలని చూసిన వారున్నారు. అయినా నేటిధాత్రి ఎవరినీ లెక్క చేయలేదు. కార్మికుల పక్షాన పోరాటం ఒక్కటే అక్షర ప్రయాణానికి మార్గం చేసుకున్నాము. కేవలం కార్మికుల సంక్షేమం కోసం, వారి మనుగడ కోసం, బతుకుపోరాటంలో నీడ కోసం ఉదాత్తుడైన సినీ పెద్ద ప్రభాకర్‌ రెడ్డి చూపిన చొరవ తమకు వరంగా మారుతుందని ఎన్నో కలలుగన్నారు. ఆయన వేసిన మార్గం, బతుకు తెరువుకు ఆయన చూపిన దారిని కూడా కొందరు సినీ గద్దలు మూసేశారు. కార్మికులను కనీసం మనుషులుగా చూసేందుకు కూడా ఇష్టపడరు. ఇది ఆనాటి నుంచి కార్మికుల పట్ల సినీ పెద్దలలో వున్న అహంకారానికి, ఆధిపత్యానికి నిదర్శనం. అలాంటి వారి జీవితాలను ఒక నీడ చూపాలని, కనీసం వారికి ఉపాధి కరువైన సమయంలో కూడా గూడు లేని జీవితాలు కాకూడదని ప్రభాకర్‌రెడ్డి అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. అంతే కాకుండా తన సొంత భూమిని కూడా కార్మికులు ఇచ్చారు. దాంతో ప్రభుత్వం స్పందించి, సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు రావాలన్న ఆలోచనతో 69 ఎకరాల స్థలమిచ్చారు.

అప్పుడే సినీ పెద్దలకు కన్ను కుట్టింది. అందులో తమకూ వాటా కావాలని కన్నేశారు.

కార్మికులకు అందాల్సిన భూమిలో 14 ఎకరాలు నొక్కేశారు. సొసైటీని గుప్పిట్లో పెట్టుకొని విల్లాల్లాంటి రోహౌజ్‌లను నిర్మాణం చేసుకున్నారు. అవి అక్రమం..అన్యాయం…దోడీపికి నిదర్శనం. అసలు సినీ కార్మికుల భూమి మీద కన్నేయడమే పెద్ద తప్పు. అయినా సిగ్గూ ఎగ్గూ లేకుండా కార్మికుల నోటి కాడి కూడును లాగేసినట్లు, 14 ఎకరాలు అప్పనంగా తీసేసుకున్నారు. నిజానికి సినీ పరిశ్రమలో అందరూ ఒక్కటే అని గొప్పగా చెప్పుకునే సోకాల్డ్‌ గద్దలు, కార్మికులలో ఒకరుగా అప్పార్టుమెంట్లలో ప్లాట్లు తీసుకుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. కార్మికులకు అన్యాయం జరిగేది అసలే కాదు. కాని కార్మికులను అంటరానివారిగా వారి ప్లాట్లకు దూరంగా, ప్రత్యేకంగా విల్లాల నిర్మాణం చేసుకున్నారు. వాటికి ఎలాంటి అనుమతులు లేవు. అయినా కట్టుకున్నారు. తమను ఎవరు ప్రశ్నిస్తారనే ధైర్యం. సినీ పెద్దల జోలికి ఎవరూ రారన్న అహంకారు. ప్రభుత్వాలు కూడా తమతో స్నేహంగా వుంటాయన్న అతివిశ్వాసం. తమతోనే ప్రభుత్వానికి అవసరం అన్న అతి ధీమాతో ఇప్పటి వరకు సినీ గద్దలు ఆలోచించారు. ప్రజలే కాదు, పాలకులైనా సరే తమను సెలబ్రిటీలుగా గుర్తిస్తారన్న అహంకారంతో కార్మికులను అన్యాయం తలపెట్టారు. కాని సినీ పరిశ్రమలో చిన్న చిన్న వేషాలైనా సరే, తెర మీద కనిపించాలన్న కోరిక కొందరిదైతే, సినిమాలో బాగమైతే చాలు అనుకొని కళామతల్లికి సేవ చేశారు. కష్టాలెన్నొ భరించారు. లైట్లు మోశారు. నటులకు గొడుగులు పడుతూ, ఆఖరుకు సినీ పెద్దల బూట్లు కూడా మోసేందుకు కూడా వెనుకాడక సినీ రంగంలో పనిచేశారు. అలాంటి వారి భూమిని కూడా లాక్కొని కార్మికుల ఆత్మగౌరవం ముందు సినీ గద్దలు ఇప్పుడు తలదించుకునే పరిస్దితి కొని తెచ్చుకున్నారు. నీతులు చెప్పినట్లే చెబుతూ కార్మికుల స్ధలం కొట్టేసిన వాళ్లే రోహౌజ్‌లలో ఎక్కువగా వున్నారు. కార్మికుల పక్షాన నిలుస్తామని నమ్మించిన వాళ్లే వాటి దోపిడికీ తెగబడ్డారు. ఇప్పుడు తలెత్తుకోలేని స్దితిని తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!