Headlines

చిత్రపురిలో చిత్రవిచిత్ర దోపిడీ విన్యాసాలు ఎపిసోడ్‌ – 1

https://epaper.netidhatri.com/

చిత్రపురిలో సినీ పె(గ)ద్దలు?

-పేద కార్మికుల భూమిపై వాలిన రాబంధులు.

-కార్మికుల స్థలాలను వదలని అక్రమార్కులు.

-తెలంగాణ కార్మికులకు అన్యాయం చేస్తున్న అవకాశవాదులు.

-కార్మికుల స్థలాలు కొందరు నిర్మాతల వశం.

-250కి పైగా జరిగిన ఇండ్ల నిర్మాణం.

-రోహౌజ్‌ ల కూల్చివేతకు ప్రభుత్వ నిర్ణయం.

-ఇప్పటికే నేల మట్టం కావాల్సిన కట్టడాలు.

-మళ్ళీ రంగంలోకి సినీ పెద్దలు.

-కూల్చివేతలకు అడ్డంకులు.

-గత ప్రభుత్వ పెద్దల ఘన కార్యం.

-కార్మికులకు చెందాల్సిన భూమిలో నిర్మాతలకు భాగం.

-దొడ్డిదారిన దూరిన నిర్మాతల సంఘం.

-చితికిపోయిన కార్మికుల పాలిట శాపం.

-నలభై ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభం.

-ప్రభుత్వ జీవోల ఉల్లంఘన.

-యధేచ్చగా నిర్మాతలు ఆక్రమణ.

-జరుగుతున్న తతంగంపై రేవంత్‌ సర్కార్‌ దృష్టి.

-ఇప్పటికే వాటిపై సమీక్షలు.

-సినీ పెద్దల దోపిడీకి అరికట్టేందుకు చర్యలు.

-త్వరలో కార్మికులకు అందనున్న శుభవార్తలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

వాళ్లు సినీపెద్దలు. పేద సినీ కార్మికుల భూమిపై వాలిన గద్దలు! సామాజిక సమస్యలపై సినిమా తీస్తారు. సమాజ సమస్యలను ఇతివృత్తంగా సినిమాలు నిర్మిస్తారు. పేదల జీవితాలను కళ్లకు కట్టినట్లు తీస్తారు. యువతకు ఆదర్శాలు నేర్పుతారు. పాలకులకే పాఠాలు నేర్పాతారు. ప్రతిసినిమాలో ఆదర్శాలు వల్లిస్తారు. పేదల జీవితాలను ఎలా బాగు చేయొచ్చొ చూపిస్తారు. సినిమను రక్తికట్టించి కాసుల వర్షం కురిపించుకుంటారు. నిజ జీవితంలో ఆదర్శాలు గాలికి వదిలేస్తారు. సమాజంలో వున్న పేదలపై వున్న ప్రేమ, తమ సినిమాకు పనిచేసే పేద కార్మికులపై వుండదు. పేదల జీవితాలను పెద్దలు చిద్రం చేస్తున్నారని సినిమాలు తీస్తారు. తమ సినిమాలకు నిత్యం సాయపడే పేద కార్మికుల పొట్టకొడుతుంటారు. పేదలకు ప్రభుత్వాలు స్థలాలివ్వాలని పోరాటాల సినిమాలు తీస్తారు. సినీ కార్మికులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్లో వాలిపోతారు. చెప్పడానికే నీతలు..తర్వాత తీసేది గోతులు..ఇదీ తెలుగు సినీ పెద్దల నిర్వాకాలు. అవును..ఈ బాగోతాలు చూడాలంటే, వినాలంటే చిత్రపురి కాలనీ బాధలు తెలుసుకోవాలి. కార్మికుల పెడుతున్న కన్నీటి బాధలు వినాలి..సినీ పెద్దలు చేస్తున్న ఆగడాలు ఎంత దుర్మార్గంగా వున్నాయ తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వ పెద్దల దాకా ఆ కార్మికుల గోస చేరాల్సిందే. పాలకపెద్దల దృష్టికి కార్మికుల గోడు చేరాల్సిందే..
రంగుల ప్రపంచంలో విషవలయాలు అనేకం వుంటాయి.
విషనాగులు కోరలు చాచుకొని వుంటాయి. నీతులు మాత్రం చెప్పడానికే, తప్ప ఆచరించడానికి కాదనుకునేవారే ఎక్కువగా వుంటారు. అందులోనూ సినీ రంగంలో మరీ ఎక్కువగా వుంటారు. అదో మాయా ప్రపంచం. ప్రపంచమంతా తమలో వుందనే భావనతో కలలు కంటుంటారు. సీని కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంటారు. వారి బతుకులతో చెలగాటమాడుకుంటారు. అందటా వివక్షే..ఒకసినిమా తీయాలంటే నిర్మాత ఒక్కడుంటే చాలదు. ఒక్క దర్శకుడితోనే సినిమా పూర్తి కాదు. హీరో వుంటేనే సినిమా పరిపూర్ణమనరు. తెరమీద కనిపించే కార్మికులే కాదు, తెర వెనక కష్టపడే ఎంతో మంది కార్మికులు కలిస్తేనే సినిమా. అందరూ ఇష్టపడి పనిచేస్తేనే సినిమా. సినీ నిర్మాతలు కాసులు ఖర్చుపెడితే, కార్మికులు కష్టపడితే సినిమా అవుతుంది. అంతే కాని నిర్మాత చేతిలో డబ్బులు పట్టుకొని తిరిగితే సినిమాకాదు. కాని పెట్టుబడి దారుడు ఎక్కడైనా దోపిడీ దారుడే. నిర్మాత ఒక్కడే బాగుంటే సినీ పరిశ్రమ బాగున్నట్లు కాదు. అందరూ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగున్నట్లు…అందరూ సంతోషంగా వుంటనే సినీ పరిశ్రమ బతుకుతున్నట్లు. కాని కొందరు సినీ పెద్దల మూలంగా ఎంతోమంది సినీ కార్మికులు కన్నీళ్లు మింగి బతుకుతున్నారు. కష్టాల జీవితం గడుపుతున్నారు. ఆకలి, దప్పులతో సావాసం చేస్తున్నారు. వేషం కోసం జీవితం త్యాగం చేసుకుంటున్నారు. తెరమీద కనిపిస్తే చాలు అదే జీవితమనుకుంటారు. కష్టాలు … కాష్టాల దాకా తరుముకెళ్లినా ఫరవాలేదనుకుంటూ వేషాల కోసం ఎదురుచూస్తుంటారు. అక్కడే పని కోసం కరిగిపోతుంటారు. అలాంటి వారి బలహీనతే నిర్మాతలకు పెట్టుబడి అవుతోంది. వెట్టికి దారి చూపుతోంది. అలాంటి కార్మికుల కోసం ప్రభుత్వాలు కనికరించి తల దాచుకోవడానికి ఇంత చోటిస్తే దాన్ని కూడా కొందరు మింగేస్తున్నారు…ఇదా పెద్దల నీతి..ఇదా మనం నేర్చుకున్న సంస్కృతి. ఇదా మనం రేపతి తరానికి నేర్పుతున్నది.
కార్మికుల పక్షాన పోరాటం చేసుకందుకు ఎవరూ ముందుకు రాదు.
ఇదే సినీ పెద్దలకు కలిసొస్తున్న అంశం. అదే కార్మికుల పాటిల శాపం. నిజానికి సినిమా తీయమని నిర్మాతను ఎవరూ కోరరు. కాని కొందరు మేం నిర్మాతలమని కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంటారు. ఇది అన్యాయం. అక్రమం. అందుకు చిత్ర పురే నిదర్శనం. ఒకప్పుడు చెన్నైలో వున్న సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. తర్వాత సినీ పరిశ్రమకు మేలు చేసింది కోట్ల విజయభాస్కరరెడ్డి. ఆ కాలంలో తెలుగు సినీ కార్మికులకు చెన్నైలో చోటు లేదు. సినిమాలలో వేషం లేదు. పని చేసేందుకు పని లేదు. దాంతో సీనీ రంగంలో స్ధిరపడాలనుకున్నవారికి దారి అప్పటి ప్రభుత్వం దారి చూపాలనుకున్నది., వారికింత నీడకల్పించేదుకు, స్టూడియోలకు దగ్గరగా వుంటే వారి జీవితాలు బాగుంటాయని నమ్మి చిత్ర పురికి ప్రభుత్వం కొంత స్ధలం కేటాయించింది. నిర్మాతలకు స్టూడియోలకు స్ధలం ఇచ్చినట్లే కార్మికులకు కూడా స్థలం కేటాయించింది. ఇది జరిగి నలభై ఏళ్లు గడుస్తోంది. కాని అక్కడ కార్మికులకు స్ధలం అందిందిలేదు. ఇల్లు కట్టించి ఇచ్చింది లేదు. కనీసం స్థలాల కేటాయింపులే ఇంతవరకు జరగలేదు. ఒకప్పుడు వేళల్లో వున్న కార్మికుల కోసం ఇచ్చిన స్థలం ఇప్పుడు లక్షలకు చేరుకున్నారు. దాంతో కార్మికుల మధ్య విభేదాలు సృష్టించి, వారి మధ్య అంతరాలు పెంచి, చిత్రపురిని అడుగులు ముందుకు పడకుండా కొందరు సినీ స్కెచ్‌లేశారు. కార్మికులకు కేటాయించిన భూముల్లోకి చొరబడ్డారు. అందులో కొందరు నిర్మాతలు ముందున్నారు. స్ధలాలను స్వాదీనం చేసుకున్నారు.
నిజానికి చిత్ర పురి కాలనీ అన్నది సినీ కార్మికుల కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్ధలం.
అంటే జూనియర్‌ 24 క్రాఫ్ట్‌లకు చెందిన కార్మికుల కోసం కేటాయించడం జరిగింది. దానిపై సినీ పెద్దల కన్ను పడిరది. అంతే అప్పటినుంచి కార్మికులకు అందింది లేదు. కాని సినీ పెద్దలు మాత్రం వాటాలు పంచుకున్నట్లు పంచుకున్నారు. వాటిలో రో హౌజులు కట్టుకున్నారు. సుమారు 250 మంది పెద్దలు అక్కడ తిష్టవేశారు. సినీ కార్మికుల ఆ స్ధలం కేటాయించినప్పుడు అది పెద్ద ఖరీదు కాదు. నేడు ఎంతో ఖరీదు. ఆ స్ధలాల అప్పగింత ఓ కొలిక్కి రాక పోవడంతో అప్పుడు సాధ్యం కాలేదు. దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడు సినీ పెద్దలు ఆక్రమించేశారు. అసలు అక్కడ పెద్దలకు గజం స్ధలం కూడా వుండకూడదు. భవిష్యత్తులో ఇలా జరుగుతుందనే ఊహించి, అప్పట్లోనే పకడ్భందీ జీవోలు జారీ చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించేంత ఆదాయం వున్న వారెవరికీ ఆ చిత్రపురిలో స్ధలాలు కేటాయించొదన్నది స్పష్టంగా జీవోల్లో రాశారు. అది అప్పటి మాట. కాని కాలం మారింది. ఆ జీవో మరుగున పడిరది. తెలంగాణ వచ్చింది. పాత జీవోల రూపం మారింది. కేసిఆర్‌ ప్రభుత్వం సినీ పెద్దలకు అనుకూలంగా కొన్ని జీవోలు మలిచింది. పాత జీవోలను తొక్కిపెట్టింది. అది సినీ పెద్దలకు అనుకూలంగా మారింది. కార్మికుల నోటి కాడి ముద్దను దోచుకునేలా చేసింది. ఇదిలా వుంటే కొంత మంది బిఆర్‌ఎస్‌ పెద్దలకు కూడా ఇందులో రోహౌజ్‌లున్నాయి. అసలు ఆ స్ధలం ఉద్దేశ్యమేమిటి? ఆ స్ధలాలు ఎవరికివ్వాలి? వాటిని పేద కళాకారులకు ఎలా అప్పగించాలి? అన్నదానిని గత ప్రభుత్వం తుంగలో తొక్కింది. బిఆర్‌ఎస్‌ నాయకులకు కూడా రో హౌజ్‌ల పేరుతో దోడిపీకి పాల్పడిరది.
తెలంగాణలో సుమారు 27 వేల వరకు 24 క్రాఫ్టులలో కార్మికులున్నారు.
తెలుగు చిత్ర సీమ కింద కనీసం ఒక లక్ష మంది వున్నారు. వారిలో ఇప్పటికీ ఎవరికీ న్యాయం జరగలేదంటే పాలకులు చేస్తున్న నిర్వాకాలేమిటి? నిర్మాతలు చేస్తున్న ఆగడాలేమిటి? పేదల స్ధలాలు లాక్కొవడమేమిటి? వాటిలో ఇండ్లు కట్టుకోవడమేమిటి? ఇదే స్ధలం సామాన్యులకు కేటాయిస్తే ఏ నాయకుడు కన్నేయలేరు. ప్రజలు తిరగబడతారు. కాని సినీ కార్మికులు కొట్లాడరు. కడుపు కాలినా సినీ పెద్దల మీద యుద్దానికి సిద్దం కారు. ఇదే వారి ధైర్యం. ఎదురు తిరిగితే వేషం పోతుందేమో? అన్న భయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే కార్మికులు న్యాయం జరుగుతుంది. అందువల్ల బక్క పేద కార్మికుల జీవితాల మీద దెబ్బకొట్టడానికి, వారి బతుకులను తుంచేయడానికి పూనుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. కార్మికులకు కేటాయించిన స్ధలాలు ఎవరూ కొనుగోలు చేయడానికి వీలులేదు. ఆక్రమించేందుకు అంతకన్నా వీలు కాదు. కాని రో హౌజ్‌ల పేరుతో ఇండ్లు కట్టుకున్న పెద్దలకు తగిన పాఠం నేర్పాలి. వారు కట్టుకున్న ఇండ్లపై ప్రభుత్వం బుల్డోజర్లు పంపాలి. ఎందుకంటే కార్మికులను నోరుండదు. నోరు తెరిస్తే ఆకలి తీరదు. అందుకే కన్నీళ్లను దిగమింగుకుంటున్న కార్మికులకు న్యాయంజరగాలి. చిత్ర పురి నుంచి గద్దలను తరిమేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!