అల్లు కున్న బంధానికి చిరు బీటలు!

చిరు అలజడి… అల్లు తిరగబడి!

పైన పటారం..లోన లొటారం!!

రచ్చకెక్కి కక్కేసుకుంటున్నారు…

పైకి ప్లాస్టిక్‌ నవ్వులు…లోలోన తవ్వుకుంటున్న గోతులు.

నాగబాబు తొందరపాటు…అలవాటుగా నోటి దురుసు.

యండమూరితో ఆనాడు కామెంట్లు..తర్వాత చివాట్లు!

అల్లు అర్జున్‌ మనవాడు కాదంటూ నేడు విసుర్లు…

అల్లు అర్జున్‌ కౌంటర్‌ ఎటాక్‌ కామెంట్లు.

సినీ పరిశ్రమ అలర్ట్‌…

రామ్‌ చరణ్‌ వదిలేసిన సినిమాతో అల్లు అర్జున్‌ హీరో అయ్యారా!

నాగబాబు మనసులో అంత కోపముందా?

స్నేహితుడికి ప్రచారం చేయడం అల్లు అర్జున్‌ తప్పా!

స్నేహితులకు హాండ్‌ ఇవ్వడం చిరుకు అలవాటేనా?

దేవీ వరప్రసాద్‌ను చిరంజీవి ఎందుకు ఆదుకోలేదు?

తన ఎదుగుదలలో కోదండరామి రెడ్డి పేరెందుకు చెప్పలేదు?

సుధాకర్‌ చిరును హీరో చేస్తే…

బ్రహ్మానందంను సుదాకర్‌కు పోటీ తెచ్చె..

చిరు ఐశ్వర్యంలో…స్నేహితులు కష్టాలలో…

చిరు స్నేహం… నిర్మాతలకు శాపం.

మెగాస్టార్‌గా చిరంజీవి ఎదగడానికి స్వయంకృషి కారణమా? లేక అల్లు రామలింగయ్య కారణమా? ఇది సినీ లోకంలో గత ముప్పై దశాబ్ధాలుగా వినిపిస్తున్న మాట. ఇప్పటికీ సాగుతున్న చర్చ. ఇదిలా వుంటే చిరంజీవి వల్ల అల్లు అర్జున్‌ హీరో అయ్యాడా? లేక అల్లు అరవింద్‌ వల్ల ఎదిగాడా? కాని తాజాగా నాగబాబు చేసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వింటే చిరంజీవి వల్లనే అల్లు అర్జున్‌కు క్రేజ్‌ ఏర్పడిరదంటూ ఓ యూట్యూబ్‌ చానల్‌లో నాగబాబు చెప్పడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చకు దారి తీసింది. నిజంగా అల్లు అర్జున్‌కు టాలెంట్‌ లేకుండానే ఎదిగాడా? రామ్‌ చరణ్‌ చేయాల్సిన సినిమా ఛాన్సు అల్లు అర్జున్‌కు ఇవ్వడం వల్లనే ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడా? ఆర్యా అనే సినిమా రామ్‌ చరణ్‌ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్‌కు త్యాగం చేశారా? నాగబాబు వ్యాఖ్యలు అల్లు కుటుంబంలో తాజాగా మరింత చిచ్చును రేపుతున్నాయని సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మద్య అల్లు అర్జున్‌ తన స్నేహితుడు వైసిపినుంచి పోటీ చేశాడు. ఆయనకు గతంలోనే అల్లు అర్జున్‌ మాటిచ్చాడు. తాన ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆచరించాడు. ఆ వైసిపి. అభ్యర్దికి మద్దతుగా ప్రచారం సాగించాడు. ఇది అల్లు అర్జున్‌ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. కాని ఇదే విషయంలో నాగబాబు అక్కసు పీక్‌ స్ధాయికి వెళ్లింది. మనవాడు, పరాయి వాడంటూ ఓ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశాడు. అది పెద్ద రచ్చకు దారి తీసింది. అయినా అల్లు అర్జున్‌ కేవలం ఒక్క అభ్యర్దికి మాత్రమే ప్రచారం చేశాడు. అయినా ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సూచిస్తాం. ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎంచుకుంటే అభివృద్ది జరుగుతుందని ఆలోచిస్తాం. అదే ఇక్కడ అల్లు అర్జున్‌ చేశాడు. అల్లు అర్జున్‌ గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి మద్దతుగా ప్రచారం చేసిన సందర్భం వుంది. అల్లు అర్జున్‌ ఈసారి కూడా జనసేనకు పూర్తి మద్దుతు పలికారు. కాని ఆయన ప్రచారానికి వెళ్లలేదు. అందుకు కారణాలు ఏవైనా వుండొచ్చు. అది ప్రజలకు అవసరం లేదు. అల్లు అర్జున్‌ జనసేనకు అనుకూలంగా ప్రచారం చేయలేదు. అది ఇప్పుడు పాత పెంకాలసులన్నీ తవ్వుకునేందుకు దారి తీసింది. అసలు చిరంజీవి లేకుంటే అల్లు అర్జున్‌ నటుడయ్యేవాడు కాదన్నట్లు నాగబాబు చెప్పడం అన్నది పెద్ద వివాదంగా మారింది. అల్లు, చిరు కుటుంబాల మద్య దూరం పెరిగిందనేదానికి ఆస్కారం ఏర్పడిరది. ఇలా వివాదాలు సృష్టించుకునేది చిరు కుటుంబమే..మళ్లీ మా మధ్య విభేదాలు మీడియా సృష్టే అంటూ తోసేయడం వారికి పరిపాటే..ఎందుకంటే వివాదాలకు ఎప్పుడూ నాగబాబు కేఆర్‌ఆఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటాడు.

అసలు చిరంజీవిపైకి ఎంతో మృధు స్వభావి అన్నంతగా ప్రచారం చేసుకోవడం ఆయనను మించిన వారు లేరు. ఎందుకంటే ఆయనతో విబేధాలున్నంత మంది సినీ ప్రముఖులు మరెవ్వరికీ లేదు. కాలం కలిసిరావడం వల్ల వారి ఆటలు సాగుతున్నాయి. చిరంజీవి ఒక్కడే కాదు, నాగబాబు, పవన్‌ వివాదాలు కేరాఫ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే వారిని ఆదుకున్నవారితో గాని, వారితో తోడుగా నిలిచి వారిని కూడా లెక్క చేయని తనం చిరంజీవి కుటుంబానికే చెల్లిందనేది సినీ వర్గాలు చెప్పే మాట. అసలు చిరంజీవికి అవకాశం వచ్చిందే కమెడియన్‌ సుదాకర్‌తో…కాని ఆయనకు చిరంజీవి పెద్దగా సహకరించిందిలేదు. సుధాకర్‌ లాంటి నటుడికి పోటీగా బ్రహ్మనందంను తెచ్చి, సుదాకర్‌కు అవకాశాలు లేకుండా చేసిందే చిరంజీవి అన్న అపవాదు వుండనే వుంది. ఇక చిరంజీవి కన్నా ముందు హీరోలైనా నారాయణ రావు లాంటి వారు ఎక్కడున్నారో అర్దం చేసుకోవచ్చు. రామ్‌ చరణ్‌ సినిమా వదిలేస్తే అల్లు అర్జున్‌ చేసి స్టార్‌ అయ్యాడంటే ఒకనాడు సూపర్‌ స్టార్‌ కృష్ణ చేయాల్సిన సినిమాను చిరంజీవి చేసి స్టార్‌ అయ్యాడన్న సంగతి తెలియంది కాదు. పట్టుదలతో, స్వయం కృషితో చిరంజీవి సినిమాలు చేసి స్టార్‌ అయ్యాడని అందరూ అంటుంటారు. కాని ఆయన స్టార్‌ డైరెక్టర్లతో ఎక్కువ సినిమాలు చేయడం వల్లనే ఆయనకు స్టార్‌ డమ్‌ వచ్చిందన్న సంగతిని ఎక్కడా చెప్పరు. ఓ ఏడాది క్రితం మీ కేరిర్‌కు బాగా దోహదపడిన డైరెక్టర్ల పేర్లు చెప్పమంటే చిరంజీవికి తొలి హిట్‌ ఇచ్చిన కోడి రామకృష్ణ పేరు చెప్పలేదు. చిరంజీవితో సుమారు 23 సినిమాలు చెసి, పెద్ద పెద్ద హిట్‌లు ఇచ్చిన కోదండరామి రెడ్డి పేరు చెప్పలేదు. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు దర్శకుడు కోదండరామి రెడ్డే స్వయంగా చిరంజీవిని తప్పు పట్టారు. చిరంజీవి తన పేరు చెప్పకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కూడా అన్నారంటే చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో అరం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు చెప్పే మాటల్లో వుండే అబద్దాలు మామూలుగా వుండవు. 1990లో రౌడీ అల్లుడు సినిమా షూటింగ్‌ సమయంలో జర్నలిస్టులు చిరంజీవిని పేపర్‌ చిదివే అలవాటు వుందా? అని ప్రశ్నిస్తే అసలు నేను పేపర్‌ చూడను అంటూ సమాధానం చెప్పారు. వరసుగా కొన్ని సినిమాలు హిట్‌ కావడంతో చిరంజీవికి రాజకీయాల మీద ఆశ మల్లింది. అప్పుడు నిత్యం నేను అన్ని పేపర్లు చదువుతానంటూ మరోసారి చెప్పారు. ఇవి ఎలా వుంటాయంటే పవన్‌ కల్యాణ్‌ నాకు చదువు కోవాలని వుండేది కాదంటాడు. తెలుగు మీడియం స్కూల్‌లోనే చదివానంటూ చెబుతుంటాడు. మా నాన్నకు దేవుడంటే నమ్మకం లేకుండేది అని పవన్‌ అంటాడు. మా నాన్నకు ఎంతో భక్తి వుండేది చిరంజీవి అంటాడు. తాను ఇంటర్‌లో బైపిసి చదివానని ఓసారి, మ్యాధ్స్‌ చదివానని ఓసాని, అసలు ఇంటర్‌ వరకు వెళ్లనే వెళ్లలేదని పలు సార్లు పవన్‌ చెప్పాడు. అంతే కాదు గుంటూర్‌కు వెళ్తే ఇక్కడే చదువుకున్నానంటాడు. పిడుగురాళ్లకు వెళ్తే ఇక్కడే ఆడుకున్నానంటాడు. నెల్లూరుకువెళ్లి ఇక్కడే ఈ గల్లీలో ఆడుకున్నానంటాడు. ఇలా జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో నా బాల్యం సాగిందంటాడు. అసలు వారు ఏం చెబుతున్నారో కూడా మర్చిపోయి చెబుతుంటారు.

జనం వెర్రి గొర్రెలనుకుంటారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇక నా జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ ప్రకటించాడు. ఇక జీవితంలో సినిమాలు చేయనంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఇక పవన్‌ కల్యాన్‌ అసలు తాను సినిమాల్లోకి రావాలనే వుండేది కాదంటాడు. ఎవరు రమ్మన్నారు? ఎవరిని ఉద్దరించాడానికి వచ్చాడు? ప్రజలు అయ్యా పవన్‌ కల్యాన్‌, నిన్ను పవర్‌ స్టార్‌ను చేస్తాం రా..రామ్మని పిలిచారా? అసలు వాళ్లు ఏం మాట్లాడతారో..ఎవరికోసం మాట్లాడతారో వాళ్లకే అర్ధమౌతుందో లేదో తెలియదు. సినిమాల విషయంలోనూ అందరితోనూ విభేదాలే.. మోహన్‌బాబుతో సినీ కేరిర్‌ అంతా వైరమే… డెబ్బై ఏళ్ల సినిమాలో తనకు తానే స్వయం ప్రకటిత లెజెండ్‌గా చిరంజీవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మోహన్‌బాబు పరువు తీయడానికి చేసిన ప్రయత్నం తెలియంది కాదు. ఠాగూర్‌ సినిమా విషయంలో హీరో రాజశేఖర్‌ కెరీర్‌ను ఎలా ఇబ్బందులకు గురిచేశారో అందరం చూశాం..ప్రజారాజ్యానికి సపోర్టుగా కాకుండా వ్యతిరేకంగా మాట్లాడాడిన రాజశేఖర్‌పై చిరంజీవి, పవన్‌ అభిమానులు దాడి చేసిన సందర్భం వుంది. అంతే కాదు 1980 దశకం హీరోలు, హీరోయిన్లు ఏటా చిరంజీవి ఇంట్లో సమావేశమై, బాలకృష్ణను పిలువకపోవడం వంటి చిల్లర పనులు చేసేదే చిరంజీవి అన్న అపవాదు వుండనే వుంది. రిక్షావోడు తర్వాత ఆయనతో సినిమా తీసేందుకు నిర్మాతలు కూడా ముందుకు రాని సమయంలో, మోహన్‌బాబు చేయాల్సిన సినిమా హిట్లర్‌ను చిరంజీవి చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇలా ఇతరులు చేయాల్సిన అనేక సినిమాలు ఆయన చేసి హిట్‌లు అందుకున్నాడు. చిరంజీవికి ఎన్నొ హిట్‌లు ఇచ్చిన దేవీ వర ప్రసాద్‌, మగరాజు తీసి సర్వం కోల్పోయి వీధిన పడితే, కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా చిరంజీవి మీద వున్నాయి. ఇక బ్లడ్‌ బ్యాంకు మీద ఆ మధ్య వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వివాదాలకే అడ్రస్సే చిరంజీవి…తన ముందు ఎవరూ ఎదగకుండా అడ్డుకున్న వ్యక్తే చిరంజీవి అని సినీ వర్గాల్లో చర్చించుకోని కుటుంబం అంటూ వుండదు. ఇప్పుడు ఆ కుటుంబంలో అల్లు అర్జున్‌ కుటుంబం చేరింది. ఈ వివాదం ఎంత దూరం పోతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!