-ఈనెల ఫిబ్రవరి 16న, జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
-సిఐటియూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన జిల్లా కార్మికులకు పిలుపు
-మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలి
కొనరావుపేట, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి ,16, నడుజరిగేదేశవ్యాప్త సమ్మె, పోస్టర్ను విడుదల చేయడం జరిగింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నియోజకవర్గాలలో, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా వేములవాడ నియోజకవర్గంలో తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం ఉంటది కాబట్టి అన్ని రంగాల కార్మికులు, కర్షకులు, శ్రామికులు, వ్యవసాయ కూలీలు, రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యావత్ ప్రజానీకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు జవాజి విమల, మరియు మధ్యాహ్న భోజన రంగా కార్మికులు బి బాలమణి, ఎం కవిత, రాధా, పి వసంత, కొలనూరు బాబాయ్,దేవవ్వ, సయ్యద్ సైయిక్. తదితరులు పాల్గొన్నారు.