ఘనంగా నిర్వహించిన తాసిల్దార్ సునీత
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 25
జయ యశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలో తాసిల్దార్ సునీత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవనీ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది అనంతరం
హై స్కూల్ నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులు అధికారులు రాజకీయ నాయకులు ర్యాలీగా చేరుకొని మానవహారం నిర్వహించారు అనంతరం తాసిల్దారు సునీత మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు పొందాలని ఈ ఓటు హక్కు ద్వారానే సమాజంలో గుర్తింపు ఉంటుందని ఓటు హక్కు ఒక వజ్ర ఆయుధంగా పనిచేస్తుందని ఓటు మీ భద్రత మీ బాధ్యత చూపుడువేలుతో తలరాతలు మార్చే శక్తి ఒక ఓటరుకు మాత్రమే ఉంటుందని ఈ ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందపరచి ఓటు హక్కు కల్పించడం జరిగిందని తాసిల్దార్ అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోటే ధర్మారావు, డిప్యూటీ తాసిల్దార్ వేణుగోపాల్ ,ఆర్ ఐ, సురేందర్, హెచ్ఎం విజయ పాల్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రమేష్, గ్రామ కార్యదర్శి నరేష్, స్కూల్ టీచర్స్, సీఏ భద్రయ్య, కారోబార్ అబ్బు, విద్యార్థినీ విద్యార్థులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు