జమ్మికుంట మునిసిపాలిటీపై మరోసారి బిఆర్ఎస్ జెండా

బిఆర్ఎస్ పార్టీకి సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు ధన్యవాదాలు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయిందని, జమ్మికుంట మున్సిపాలిటీ పై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు, కళ్యాణలక్ష్మి, రైతుబీమా, దళిత బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని అన్నారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు అభివృద్ధిలో భాగంగా అనేక బహుమతులు కూడా వచ్చేలా కెసిఆర్ కృషి చేశారన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధి విషయంలో కూడా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కూడా ఒకరిద్దరూ కారణమయ్యారని.. అయినప్పటికీ కౌన్సిలర్లంతా ఏకతాటిపై ఉండి అవిశ్వాసం వీగేలా చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు. మరోసారి జమ్మికుంట మున్సిపాలిటీపై బిఆర్ఎస్ జెండా ఎగురవేసినందుకు గర్వంగా ఉందన్నారు. అవిశ్వాసం వీగడానికి సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు మానుకొని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చడం కోసం దృష్టి సారించాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలంతా ఈ నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దన్నారు. 200 యూనిట్ల లోపు ఉన్న వారెవరు కరెంట్ బిల్లు కట్టడం అవసరం లేదని. ముఖ్యమంత్రితో పాటు వారి మంత్రి కూడా స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఎవరైనా కరెంటు బిల్లు కట్టాల్సిందేనని వేధిస్తే వారికి ముఖ్యమంత్రితోపాటు మంత్రి చెప్పిన వీడియోను చూపించాలన్నారు. ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రైతులంతా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని. కెసిఆర్ ని ప్రజల నుంచి దూరం చేయాలని పిచ్చి ఆలోచనలతో
కరీంనగర్లో బిఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కట్టారని. దానికి కరీంనగర్ సర్కిల్ రెస్ట్ హౌస్ అని పేరు పెడితే దాన్ని తొలగించి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్గా మార్చారని అన్నారు. గతంలో కూడా సచివాలయంలో కేసీఆర్ పేరుతో ఉన్న బోర్డుపై బురద రాశారని తెలిపారు. కెసిఆర్ పేరును బోర్డులు, గోడల మీద నుంచి తొలగించినంత మాత్రాన ప్రజల గుండెలో నుంచి తొలగించలేరని అన్నారు. రైతులు రైతుబంధు ఇంకా పడలేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ్యత కలిగిన హోదాలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులను చెప్పుతో కొడతానని అనడం బాధకరమని అన్నారు. ఎంతో మంది రైతులు ఓటు వేస్తేనే తాను గెలిచిన విషయం మరిచిపోవద్దని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన యావత్తు తెలంగాణ రైతులతో పాటు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో ఇల్లందకుంట ఎంపీపీ పావని వెంకటేష్, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ టంగుటూరి రాజ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్నేని సత్యనారాయణరావు, సమ్మారావు, దిలీప్, లింగారావు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version