వేములవాడ నేటిధాత్రి
వేములవాడ కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ అపూర్వం 2024 పేరుతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరియు పాఠశాల డైరెక్టర్స్ అయిన కుమ్మరి శంకర్, ఇప్పపూల వినోద్, సన్నిది వెంకట కృష్ణ పాఠశాల కరస్పాండెంట్ పాల్గొనడం జరిగింది.
ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వలన విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చు అని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ అన్నారు. పాఠశాల విద్యార్థులు 180 వర్కింగ్ మోడల్స్ తయారు చేసి చూపరులను అబ్బురపరిచేలా చేశారు.పాఠశాల కరస్పాండెంట్ సన్నిది వేంకట కృష్ణ మాట్లాడుతూ సీవీ రామన్‌గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం అని తెలిపారు. భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్దం ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇట్టి కార్యక్రమములో తల్లితండ్రులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థిని విద్యార్థులకు సహకరించిన తల్లితండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళ్యాణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పాఠశాల తరపున అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.