నిస్వార్ధ ప్రజా సేవకుడు కామ్రేడ్ కొండలరావు

పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కొండలరావుకు ఇచ్చే ఘన నివాళి
వర్ధంతి సభలో నేతలు ఉద్ఘటన

భద్రాచలం నేటిదాత్రి

నిస్వార్ధ ప్రజా సేవకుడు కామ్రేడ్ కొండలరావు అని, ఆయన స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చిటికెన ముసలయ్యలు అన్నారు.
సిపిఎం మాజీ పట్టణ కమిటీ సభ్యులు, రజక వృత్తిదారుల ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ ఐతంరాజు కొండలరావు 6వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన 8వ వార్డు మనుబోతుల చెరువు కాలనీలో జరిగింది. ముందుగా కొండలరావు స్తూపం వద్ద పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముసలయ్య ఆవిష్కరించారు. కొండలరావు చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బి. నర్సారెడ్డి, సీనియర్ నాయకులు బిబిజి తిలక్ లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ కొండలరావు పేదలకు కూడు, గుడ్డ, నీడ అందుబాటులోకి తేవాలని సిపిఎం జెండా పట్టుకుని ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేశారని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. రజక వృత్తిదారుల సంఘం నాయకునిగా రజకుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పనిచేశారని అన్నారు.నేడు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పేదల సమస్యలు గాలికి వదిలి సంపన్నులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ధనిక వర్గాలకు, సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ పేదలపై భారాలు మోపుతున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే అమర జీవి కామ్రేడ్ కొండలరావుకు మనం ఇచ్చేఘననివాళి అవుతుందని అన్నారు. సిపిఎం పార్టీకి ఓట్లు సీట్లు ప్రధానం కాదని ఓట్లు తగ్గినంతమాత్రాన కృంగిపోయేది లేదని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు.కామ్రేడ్ కొండలరావు స్ఫూర్తితో పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు ఎన్ నాగరాజు, కుంజా శ్రీనివాస్, కోరాడ శ్రీనివాస్,శాఖా కార్యదర్శులు అన్నం లక్ష్మీనారాయణ, గుండోజు రాధా, రాజలింగం, సక్కుబాయి, నాగమ్మ, చిట్టెమ్మ , నక్క సాయిరాం, బంటు రామకృష్ణ, రాజమండ్రి వెంకటేశ్వరరావు, అజయ్ కుమార్, నక్క రాధా, కమలమ్మ,వైష్ణవి ,ఆంజనేయమ్మ, సత్యవతి,లక్ష్మీ, తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version