బంగారు పతకం సాధించిన జాగిలం సింబా
మంచిర్యాల,నేటి ధాత్రి:
వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పాల్గొనీ గంజాయి,మత్తు పదార్థాలను గుర్తించడం లో పోలీసు జాగిలం సింబా,డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.వేణుగోపాల్ కృష్ణ బంగారు పతకం సాధించడం జరిగింది.అదేవిదంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్ గా సింబా ఎంపిక కావడం గొప్ప విశేషం.సోమవారం రోజున రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తమ కార్యాలయం లో నార్కోటిక్ డాగ్ సింబా,డాగ్ హాండ్లర్ ను అభినందించారు.2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీసు డ్యూటీ మీట్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి,రామగుండం పోలీస్ కమీషనరేట్ కి మంచి పేరు తీసుకు రావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ ఐపీఎస్,పెద్దపల్లి డిసిపి పి.కరుణాకర్,ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్,ఏఆర్ ఏసిపి ప్రతాప్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్,వామనమూర్తి,సంపత్,మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.