హన్మకొండ, నేటిధాత్రి:
ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ…
హాన్మకొండ నగరం నడి ఒడ్డున ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నారాయణ వైట్ హౌస్ కో బ్రాంచ్ పేరుతో స్కూల్ గ్రౌండ్ మరియు ఫైల్ సేఫ్టీ లేకుండానే గత మూడు నాలుగు నెలల నుండి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పాఠశాల నిర్వహించేద్దామని సంబంధిత విద్యాశాఖ అధికారికి ఏ బి ఎస్ ఎఫ్ మరియు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసిన వెనువెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్న యాజమాన్యంపై మూసివేయాలని సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి ఎం ఈ ఓ చెప్పినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారి ఎంఈఓ కార్పొరేట్ విద్యా సంస్థకు కొమ్ముగాస్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు సైతం పట్టించుకోకుండా కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.