వరంగల్ తూర్పు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నన్నపనేని

వరంగల్ తూర్పు ప్రజలకు పాదాభివందనం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మరోమారు తూర్పు నుండి ఎమ్మెల్యేగా నామినేషన్

నా గెలుపు నల్లేరుమీద నడకే

ప్రజల ఆశీర్వాదంతో మరోమారు భారీ మెజారిటీతో గెలుస్తా

____ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్, వరంగల్ తూర్పు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బండ ప్రకాష్ తో కలిసి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నామినేషన్ కేంద్రంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆవరణంలో ఉన్న ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ల ఆశీస్సులతో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో అభివృద్ధి సంక్షేమంలో ముందుంది అని, నియోజకవర్గ అభివృద్ధి నా మొదటి ఎజెండగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులుగా, ముందుకు సాగుతు, పోయిన ఎన్నికల్లో నన్ను మంచి మెజారిటీతో గెలిపించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలకు పాదాభివందనం. రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు నన్ను గొప్పగా ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version