కొడిమ్యాల తహసిల్దార్ కార్యాలయానికి నేమ్ బోర్డ్?

కొడిమ్యాల (నేటి ధాత్రి ):

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయానికి నేమ్ బోర్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండల పరిషత్ కార్యాలయం, ఐకెపి, తహసీల్దార్ కార్యాలయాలు పక్కపక్కనే ఉండడంతో పాటు తాసిల్దార్ కార్యాలయానికి నేమ్ బోర్డు లేకపోవడంతో పని నిమిత్తం కార్యాలయానికి వెళ్లే ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నిత్యం విధులకు హాజరవుతున్న అధికారుల సైతం నేమ్ బోర్డు ఏర్పాటుపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version