పురపాలికలే లక్ష్యం– మున్సిపల్ ఎన్నికల సన్నాహాస సభలో ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 3 :
పురపాలికలే లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిహెచ్ఎంసి పూడూర్ – కిష్టాపూర్ పరిధిలోని తన నివాసంలో మున్సిపాలిటీల్లోని నాయకులతో శుక్రవారం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయడి నేను మీకు అండగా ఉంటానన్నారు. రాజకీయ నాయకుడికి గెలవడమే అంతిమమని, సుపరిపాలన, ప్రజలు మెచ్చే పాలన అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు. మన పరివార క్షేత్రాలు అనేక సమస్యల మీద కొట్లాడతాయని, వాటిని పరిష్కరించే సత్తా అధికారంలోకి వస్తేనే ఉంటుందన్నారు. అధికారం రాకపోతే మనం గెలిచిన వారి ఇంటి ముందు కాపలాకాయాల్సిందేనని, మస్కా కొట్టి పని చేయించుకునే పరిస్థితి పోవాలంటే మనం గెలవాలన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఛైర్మన్, నీటి సంఘాల చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు ఏదీ ఓడిపోలేదన్నారు. మన కొట్లాట వల్ల జిహెచ్ఎంసి లో మన కార్పొరేటర్స్ కి 300 కోట్ల నిధులు వచ్చాయని గుర్తు చేశారు. బీజేపీ లెటర్ ప్యాడ్ మీద లెటర్ పెడితే కోట్ల నిధులు వచ్చాయన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, నందా రెడ్డి, హృదయకుమార్, కొరివి కృష్ణ, చంద్రారెడ్డి, శోభమ్మ, రామోజీ, సురేష్, మోహన్ రెడ్డి, సుధాకర్, లక్ష్మమ్మ, శైలజ, వెంకటరెడ్డి, శ్రీనివాస్, పావని తదితరులు పాల్గొన్నారు.
