ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చాలి.

# భారీ ఎత్తున ర్యాలీ – దుగ్గొండి ఎమ్మార్వో కార్యాలయంలో మెమోరండం.

నర్సంపేట,నేటిధాత్రి :

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మైనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అభయహస్తం లో భాగంగా ముదిరాజులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ కులస్తులు దుగ్గొండి మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.అనంతరం ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలోని డిప్యూటీ తహసిల్దార్ కు మెమోరండం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్,ఎన్నారై విభాగం రాష్ట్ర ఇంచార్జ్ శానబోయిన రాజ్ కుమార్,జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సోమన్న,జిల్లా గౌరవ అధ్యక్షుడు జినుకల కొమ్మాలు ముదిరాజ్ లు మాట్లాడుతూ 2009 ఫిబ్రవరి 19 న జి వో నెం 15 ప్రకారం ముదిరాజ్/ముత్తరాశి/తెనుగోళ్లు బీసీ-డి నుండి బీసీ-ఎ లోకి పునరుద్ధరణ చేసి తక్షణమే దానిని బీసీ ఎ లోకి మార్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ముదిరాజులకు ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.చెరువులు కుంటలపై ముదిరాజులకు సంపూర్ణ హక్కులు కేటాయించాలన్నారు.ముదిరాజులకు రాజకీయంలో ప్రాతినిధ్యం వహించడానికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి నేరేడు సదానందం,జిల్లా యూత్ అధ్యక్షుడు పోలు అమరచందు,జిల్లా నాయకులు గోనెల నరహరి,నెక్కొండ మండల అధ్యక్షులు తోట సాంబయ్య, భాస్కర్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు హంస విజయరామరాజు దుగ్గొండి మండల అధ్యక్షులు పల్లె రమేష్, ఉపాధ్యక్షులు ముత్యాల స్వామి,రాములు, మంద బిక్షపతి, నేదురు రాజేందర్, సోడ సమ్మయ్య, ఈర్ల రమేష్, మంద రాజు, లక్క రమేష్జ్ వరంగంటి తిరుపతి, కొలువుల సాంబయ్య, తుమ్మలపల్లి మహేందర్, గొర్రె రామకృష్ణ,తౌటి రవి, దండు రాజుతో పాటు గ్రామాల కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *