పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో నడికూడ ఐకేపి సిసీ కుమార స్వామి గ్యాస్ట్రిక్ సమస్యతో పరకాల ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.అది తెలుసుకున్న పరకాల యంపిడిఓ పెద్ది ఆంజనేయులు వెళ్లి వారిని పరామర్శించి ఆర్.యం.ఒ తో మాట్లాడి సరియైన చికిత్స చేయవలసినదిగా చెప్పడం జరిగింది.అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని గతంలో హార్ట్ స్టంట్ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని తెలిపారు.ఏలాంటి అవసరమైనా సంప్రదించాలని కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల ఏపియం క్రాంతి,ఏపిఓ ఇందిర,నడికుడ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
