గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించండి!!
ఉపాధి హామీ కూలీలను కోరిన ఎంపీటీసీ సభ్యులు బషీర్!!
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలో మంగళ వారం రోజున ఉపాధి హామీ కూలీలను కలిసి,మాట్లాడుతూ మే మూడో తేదీన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలనీ ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలిలను కలిసి. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి ని భారీ మెజారిటీతో గెలిపించాలని,ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఉపాది హామీ కూలీని 200 నుండి 400 వందలకు పెంచుతామని,ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎండపల్లి ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ బషీర్ ఉపాధి హామీ కూలీలను కోరారు ,, ఈ కార్యక్రమంలో పొట్లపల్లి సత్యనారాయణ రావు దేవి రవీందర్ , తోడేటి బాల్లింగ్ కే వెంకట్ రెడ్డి, ముస్కురాజేశ్వర్ రెడ్డి తీపి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సింగిరెడ్డి రవీందర్ రెడ్డి గుండ శ్రీనివాస్ రెడ్డి గుండ నరసింహారెడ్డి మంతెన నరసయ్య మంతెన లక్ష్మణ్ బుసరపు అశోక్ కనుకుట్ల రఘువర్ధన్
,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు
