ఖమ్మం జిల్లా నేటి ధాత్రి
ఎంపీ రవిచంద్ర,నాగేశ్వరరావు మంత్రి అజయ్ కుమార్, ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే వెంకటవీరయ్యలతో కలిసి ఖమ్మంలో ఈనెల ఐదున జరిగే బీఆర్ఎస్ సభ నిర్వాహణ,ఏర్పాట్లను పరిశీలించారు
ఈనెల ఐదవ తేదీన ఆదివారం ఖమ్మంలోని ఎస్ఎన్ఆర్ &బీజేఎన్ఆర్ కాలేజీ మైదానంలో బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగనుంది.ఈ దృష్ట్యా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే వెంకటవీరయ్యలతో కలిసి గురువారం ఉదయం సభాస్థలిని పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల్లో నిమగ్నమైన వారికి పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.