కెసిఆర్ మేనిఫెస్టోతో ‘చేతు’ లెత్తేసిన ప్రతిపక్షాలు
శివాలయం సాక్షిగా చెబుతున్న మాట నిలబెట్టుకుంటా…
రైతుకు రుణమాఫీ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్..
7 సార్లు అతనికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి…
మీ బిడ్డగా అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి హుజరాబాద్ ని మరో సిద్దిపేటల తీర్చిదిద్దుతానని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా
వీణవంక మండలంలోని బేతిగల్, కనపర్తి, నర్సింగపూర్, వల్బాపూర్, జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి, పెద్ధంపల్లి, ఆబాది జమ్మికుంట గ్రామాలలో గ్రామాల ప్రజలనుదేశించి మాట్లాడారు. జగ్గయ్యపల్లి గ్రామ పోచమ్మ సాక్షిగా చెబుతున్న ఊళ్లోని అన్ని సమస్యలు పరిష్కరించడంతోపాటు పోచమ్మ గుడి, భూలక్ష్మి-మాలక్ష్మిని కూడా చేసుకుందామని అన్నారు. అలాగే వనపర్తి గ్రామ ప్రజల కోసం కల్వల్ల ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం భూలక్ష్మికి తన వంతు సహాయంగా 2 లక్షలు అందిస్తానన్నారు. పోచమ్మ గుడి కోసం 10 లక్షలు కూడా ప్రభుత్వం తరఫున అందజేస్తామన్నారు. బేతిగల్ నుంచి పోతిరెడ్డిపేట వరకు బ్రహ్మాండంగా రోడ్డు వేసుకుందాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర బాగోగుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచాడన్నారు. దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రైతు రుణమాఫీ 14 వేల కోట్లు చేశారని, మర్చిపోరని మీ అందరికి కూడా మిగిలిన రుణమాఫీ కూడా వారం పది రోజుల్లో చేస్తారని హామీలు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్నీ కోనకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కోసం ప్రతి గింజను కొని రైతుల ఎకౌంట్లోకి పది రోజుల్లో డబ్బులు పంపిన నాయకుడు అని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త మేనిఫెస్టోతో ఎమ్మెల్యే ప్రతిపక్షాలకు చెమటలు పడుతున్నాయన్నారు. ఓటమి భయంతో ఇప్పటికే ప్రతిపక్షాలు ‘చేతు’లెత్తేసాయని అన్నారు. కొత్త మేనిఫెస్టోలో మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు ప్రతి మహిళకు నెలకు 3 వేల చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 15 లక్షల వారికి పెంచమన్నారు. గ్యాస్ సిలిండర్ ని కూడా 400కి ఇస్తామన్నారు. రైతుబంధు పథకాన్ని కూడా 16 వేలు చేస్తామన్నారు. గ్రామాల్లో దరఖాస్తు పెట్టుకున్న అందరికీ గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తామని, బీసీ లోన్ కింద దరఖాస్తు పెట్టుకున్నా అందరికి లక్ష రూపాయల చెక్కును ఎన్నికల అనంతరం ఇస్తామన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ఏడుసార్లు అవకాశం ఇచ్చిన అభివృద్ధి చేయలేదని, నాకు ఏడుసార్లు అవసరం లేదు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని భరోస కల్పించారు. నన్ను గెలిపించిన వెంటనే నరసంగాపూర్ ని దత్తత తీసుకొని మిగిలిన పనులన్నీ చేస్తానని శివుని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్న అన్నారు.
మీ ఆడబిడ్డగా దండం పెట్టి, కొంగు పట్టి అర్థిస్తున్న ఒక్క అవకాశం ఇవ్వండి
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని
దండం పెట్టి, కొంగు పట్టి అర్ధిస్తున్న ఒక్క అవకాశం ఇవ్వాలంటూ హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. కౌశిక్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా మా ఇంట్లో కంటే ఎక్కువ మీతోనే ఉన్నారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్నాడని దయచేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో అక్కడి ప్రజలంతా ఆమెకు మద్దతు పలుకుతూ తప్పక ఓటేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్, ఎంపీపీలు రేణుక తిరుపతి రెడ్డి, దొడ్డే మమత, జడ్పీటీసీలు మాడ వనమాల సాదవరెడ్డి, శ్రీరాం శ్యామ్ పిఎసిఎస్ చైర్మన్లు విజయభాస్కర్ రెడ్డి, పొనగంటి సంపత్, మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.