మహబూబ్ నగర్ / నేటి ధాత్రి
హైదరాబాదులోని సంధ్య థియేటర్ లో పుష్ప-2 చూసేందుకు వెళ్లి తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న శ్రీతేజను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. అస్పత్రి వైద్యులతో మాట్లాడి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ తండ్రి రమేష్ మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.శ్రీతేజ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఎంపీ డీకే అరుణ అన్నారు.