-హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ కు చిరు సత్కారం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను మొగుళ్ళపల్లి మండల టిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేర్పాటి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా స్థానిక పోలీస్ కార్యాలయంలో కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇదే పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుండేటి సుధాకర్ రాష్ట్రస్థాయి పోలీసు సేవా పథకానికి ఎంపికైనందున ఆయనను శాలువాతో సత్కరించారు.