గొల్లపల్లి( జగిత్యాల) నేటి ధాత్రి:
మాదిగ రాజకీయ పోరాట సమితి జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి దుమల పెద్ద గంగారం శుక్రవారం రోజున హఠాత్తుగా గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చెవుల మద్ది శ్రీనివాస్ మాదిగ శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట సీనియర్ నాయకులు. గంగాధర మహేష్, కట్కూరి కరుణాకర్, బిరుదుల లక్ష్మణ్, వడ్లూరి దుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
