సబ్ సెంటర్ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం మేజర్ గ్రామపంచాయతీ గ్రామంలో శుక్రవారం చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ స్కీమ్ ప్రాజెక్టులో భాగంగా 20 లక్షల రూపాయలతో ఆరోగ్య కేంద్రానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉండే బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా అనేక విధాలైన మందులను ప్రజలకు ఉచితంగా ఇస్తుందని అన్నారు. 6 గ్యారంటీలలో భాగంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందే వ్యక్తికి ఐదు లక్షల నుండి 10 లక్షల రూపాయలు పరిధిని పెంచడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలలో అనేక ప్రాథమిక ఆరోగ్య సెంటర్లను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. కాసింపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐ బన్సీలాల్, ఎస్సై ఉపేందర్ రావు, తహసిల్దార్ వనజ రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, జడ్పీ సీఈవో గణపతి, కుందారం మెడికల్ ఆఫీసర్ శ్రావ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫయాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రాజ్, రమేష్, విశ్వంభర్ రెడ్డి జైపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *