సోమన్న జాతర గోడ ప్రతుల ఆవిష్కరణ

పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి నేటిధాత్రి

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవముల ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. పాలకుర్తి సోమన్న జాతర మహా అద్భుతంగా జరగాలని, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని, అధికారులు అందరూ అప్రమతంగా ఉండాలని, అదేవిదంగా సోమన్న జాతర గోడ ప్రతులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో మహాశివరాత్రి జాతర జరగాలని, అధికారులు అందరూ అందుబాటులో ఉండి ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. అంతకు ముందు భక్తుల దృశ్య జాతర ఏర్పాట్లను ఆలయ అధికారులతో పరిశీలించి తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మి ప్రసన్న, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version