#ఎమ్మెల్యే పెద్ది చొరవతోనే మండల కేంద్రంలో బ్యాంకు ఏర్పాటు.
#డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ .
నల్లబెల్లి నేటి ధాత్రి: మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిసిసి బ్యాంక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, చైర్మన్ మార్నేని రవీందర్ హాజరై ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఒకప్పుడు సహకార సంఘాలలో రైతులు భాగస్వాములు కావాలని ఎవరు ముందుకు వచ్చే ప్రయత్నం ధైర్యం చేయలేదని ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడం రైతులు భాగస్వాములు కాలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార సంఘాలకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రభుత్వం ఏర్పాటుచేసి సంఘాలను బలోపితం చేసి రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని అదేవిధంగా తన సొంత ఊరిలో బ్యాంకు ఏర్పాటుకు కృషిచేసిన చైర్మన్ రవీందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ఓడి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ఎంపీపీ ఊడుగులసునీత, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, సుకినే రాజేశ్వరరావు, ఊరటి మహిపాల్ , ఆకుల రమేష్ గౌడ్, మోరాల మోహన్ రెడ్డి, డిసిసిబి జిఎం శ్రీధర్, డీజీఎం కురువ నాయక్, రాజశేఖర్, సీఈవో చిన్నారావు, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, సర్పంచ్ రాజారాం, ఎంపిటిసి జయరావు, కోఆప్షన్ సభ్యురాలు నజీమా, సీఈవో నాగలి మొగిలి, పాలకవర్గ సభ్యులు, బ్యాంకు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.