భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలో 34కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
పనుల ప్రారంభోత్సవాల అనంతరం భూపాలపల్లి అంబెడ్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ
అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా భూపాలపల్లీ మున్సిపాలిటీనీ ఏర్పాటు చేసుకున్నాం
మున్సిపాలిటీగ రూపాంతరం చెందే ప్రక్రియలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని స్థిరమైన స్థానాన్ని కల్పించడం జరిగింది.
మున్సిపాలిటీ గా ఏర్పడిన తరువాత దిన దిన అభివృద్ధి చెందుతూ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక దృష్టితో నిధులు చేశారు
అంతర్జాతీయ ప్రమాణాలతో భూపాలపల్లిలో ఇండోర్ ఔట్ డోర్ స్టేడియం నిర్మాణములు జరుపుకుంటూన్నం.
ప్రధాన సమస్య గా ఉన్న నీటి సమస్య పూర్తిగా నిర్మూలించుకుని ప్రతి వార్డులో నీరు అందుబాటులో తెచ్చుకున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి తార్కాణం మొన్నటి మొన్న హైదరభాద్ లో ఎకరాల భూమి 100కోట్ల వరకు చేరింది
పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుంది.
ఒకప్పుడు ప్రభుత్వ ధవకనలలో చికిత్స చేసుకోవాలంటే ఆలోచించే తరుణం
సాధించిన తెలంగాణలో వైద్య రంగాన్ని మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ దవాఖానలపై ఒక నమ్మకాన్ని కల్పించి అందుబాటులోకి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందిస్తోంది.
భూపాలపల్లి పట్టణంలో ప్రభుత్వ పరమైన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా, కులం, మతం తేడా లేకుండ అమలు చేస్తున్నాం.
భూపాలపల్లి పట్టనానికి ఔటర్ రింగ్ రోడ్డుపై తీసుకుని వస్తా అంటే ఎవరుకుడ నమ్మలేదు
ముఖ్యమంత్రి కేసిఆర్ సహాయ సహకారాలతో ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు, ప్రస్తుతం భూ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి.
వచ్చే ఏడాది వరకు భూపాలపల్లి పట్టణ వాసులకు ట్రాఫిక్ రహిత పట్టణంగా రూపం చెందుతుంది.
భూపాలపల్లీ అభివృద్ధి లో కీలక పాత్ర సింగరేణి బొగ్గు కార్మికుల కృషి ఉంది.
సింగరేణి కార్మికులను ఇటీవలే కొంతమందినీ డిస్మిస్ చేస్తే ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది.
భూపాలపల్లి ప్రజలు ఇచ్చిన సదవకాశంతో నాకున్న పరిధిలో పట్టణాన్ని నభూతో నా భవిష్యత్ అనే తీరులో అభివృద్ది చేయడం జరిగింది.
రానున్న రోజుల్లో గల్లి నుంచి ప్రధాన రహదారి వరకు ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసుకుందాం
రానున్న రోజుల్లో వర్షాల కారణంగా పట్టణంలో నీటి మయం కాకుండా రూ.102 కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం.
త్వరలోనే ఎంత పెద్ద వర్షం వచ్చిన ఒక్క నీటి బొట్టు ఆగకుండా చూసే బాధ్యత నాది
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 4ప్రతి హామీని చిత్త 4శుద్ధితో అమలు చేస్తుంది
మేనిఫెస్టోలో లేని పథకాలను దేశంలో అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మనది.
విజ్ఞులైన భూపాలపల్లి జిల్లా, పట్టణ ప్రజలు ఆలోచించాలి.
అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని హక్కున చేర్చుకోవాలి అని ఎమ్మెల్యే గండ్ర ప్రజలకు వివరించారు
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వెంకటరమణ సిద్దు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పిహెచ్ఎస్ చైర్మన్ మేకల సంపద ఎంపీపీ లావణ్య ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.