భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది రైతులకు రైతు బీమా సౌకర్యం రైతు బంధు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను 22వ వార్డు ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి ఎన్నికల ఖర్చుగా తమ వంతుగా 5000 రూపాయలను బహుమతిగా ఇచ్చారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు