గోదావరి జలాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పూజలు హాస్యాస్పదం …

గోదావరి జలాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పూజలు హాస్యాస్పదం .

#నియోజకవర్గాన్ని గోదావరి నది జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత పెద్దికే దక్కుతుంది.

#గోదావరి నీళ్లకు పూజలు చేసిన సర్పంచ్ సపావట్ కవిత దేవ్ నాయక్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

గోదావరి జలాలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పూజలు చేయడం హాస్యస్పదమని సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ అన్నారు.
ఈ మేరకు మండలానికి గోదావరి జలాలు తరలివచ్చే మాన్సింగ్ తండా మెయిన్ కెనాల్ వద్ద సర్పంచ్ గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏడు గ్రామాల తోపాటు వేలాది సాగు భూములను ముంపుకు గురి చేసేందుకు యత్నించి రంగయ్య చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిగట్టిన సంగతి మండల ప్రజలకు తెలిసిందే అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండలంలోని ఏజెన్సీ గ్రామాల రైతుల విన్నపం మేరకు ముంపును నివారించి ప్రాజెక్టును నిర్మాణం చేసి నల్లబెల్లి ఖానాపూర్ నర్సంపేట చేన్నారావుపేట మండలాల ను సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా రిటైర్డ్ ఇంజనీర్లతో ప్రత్యేక సర్వేలు చేపట్టి గోదావరి జలాలను తరలించేందుకు ప్రణాళికలు రూపొందించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించిన మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే రూ, 305 కోట్ల నిధులను విడుదల చేశారన్నారు. ఇట్టి నిధులతో రామప్ప వద్ద పంపు హౌస్ ఏర్పాటు చేసి రెండు పైపులైన్ల ద్వారా రంగయ్య చెరువు, పాకాల, మాదన్నపేట చెరువులకు గోదావరి జలాలతో నింపి బీడు భూములను సైతం సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి

దక్కుతుందన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దొంతి మాధవరెడ్డి మరో మారు వేలాది ఎకరాలతో పాటు ఈ ప్రాంత ఏజెన్సీ గ్రామాల ముంపున కు గురి చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదికలు పంపిన విషయం నియోజకవర్గ ప్రజలకు తెలిసిందే అన్నారు. లోపాయ కారకంగా ఏజెన్సీ గ్రామాలతో పాటు భూములను ముంపుకు గురిచేందుకు కుట్రలు చేస్తూనే మరో ప్రక్క ప్రజలను నమ్మించేందుకు తమ నేత తీసుకువచ్చిన గోదావరి జలాలకు కపట ప్రేమ వలకబోస్తూ పూజలు చేయడం హాస్యస్పదం గా ఉందన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే మండల రైతాంగం తో పాటు నియోజకవర్గ రైతులకు గోదావరి జలాలు సమృద్ధిగా అందేందుకు నిలిచిపోయిన కుడి ఎడమ కాలువల పనులను పూర్తిచేస్తూనే ప్రధాన కాలువలకు తూములు ఏర్పాటు చేసి అన్ని చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలని కోరారు.

కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఇస్లావత్ రవీందర్, బానోతు వనిత లక్ష్మణ్ ,అరుణ శ్రీను, విజయ నరసింహ ప్రేమ్ కుమార్, సపావట్ స్వరూప మంగణ నాయకులు మంజీలాల్ బోడ సురేష్, బోమ్మిడి శివ రెడ్డి ,బానోతు బక్షనాయక్ ,మంగణ నాయక్ ,నరసింహ చారి ,సతీష్ ,ఉమేష్ ,ప్రశాంత్ రెడ్డి సాయిలు, యాకన్న ,రమేష్ ,చిన్నయాకు ,విజయ్ ,వెంకన్న, హుస్సేన్, వాల్యా సంగులాల్ ,రత్తి చంద్రు, యూత్ సభ్యులు బానోతు నితిన్, పవన్ ,యాకు బన్నీ మున్నా, నవీన్ ,దినేష్ సాయి, రణధీర్ ,రాంబాబు, నితిన్ సంతోష్ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version