# నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ పైప్ లైన్ ద్వారా కొన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదని అందుకుగాను ప్రతి ప్రాంతానికి ఆ మిషన్ భగీరథ నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో కొన్ని ప్రాంతాలలో మిషన్ భగీరథ మంచినీరు సరఫరా కావడం లేదని ప్రజలు తెలుపుతున్న ఫిర్యాదు మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ సంబంధిత మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ వంశీ,మున్సిపల్ ఏఈ రాజేష్, మిషన్ భగీరథ వాటర్ సప్లై ఇన్చార్జి లింగు స్వామి, మిషన్ భగీరథ గ్రిడ్ ఇంచార్జ్ సంపత్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, వాటర్ సప్లై లైన్ మెన్స్, సప్లై లీకేజీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
బస్తి దవఖాన ఏర్పాటు కోసం ఎమ్మెల్యేకు లేఖ.
నర్సంపేట మున్సిపాలిటీలో వాడకంలో లేని పాఠశాలలో బస్తి దావఖాన ఏర్పాటు చేయాలని కోరుతూ నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి లేఖ రాశారు. బస్తీ దవఖాన ఏర్పాటు పట్ల చైర్ పర్సన్ మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఈసంపెల్లి జోనా,బాంజిపేట పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అరుణ్,మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.