బైట దిక్కు మాలిన ప్రచారాలు!!
-సినిమా నిండా సామాజిక సూక్తులు!
-బైట కాసుల కోసం మోసపు ప్రకటనలు!
-నటుల నటనంతా కల్పితం..హీరోల ప్రచారమంతా అబద్ధం!
-ఈ తరాన్నే ముంచిన సువర్ణ భూమి!
-తరతరాల పేరు చెప్పి నమ్మమంటున్న చరణ్ స్వామి.
-మాట మీద నమ్మకముండాలని అబద్ధం ప్రచారం చేస్తున్నాడు.
-మునిగిన కస్టమర్లకు ఏం సమాధానం చెబుతాడు!
-సువర్ణ భూమిలో చరణ్ గుంట కొన్నది లేదు.
-స్వగృహలో చిరుకు చిన్న ఇల్లు కూడా లేదు.
-చిరు కంట్రీ డిలైట్ పాలు తాగుతున్నారనడం నిజం కాదు!
-కోట్లు తీసుకొని ప్రకటనల చేయడం మాత్రమే నిజం.
-ఆ సంస్థలు మోసం చేస్తే మీ ఖర్మం.
-పాపపు సొమ్ము కోసం అబద్దాలెన్నైనా ఆడతారు.
-చిరు శుభగృహ అన్నాడు!
-చరణ్ సువర్ణ భూమి కొనమన్నాడు!!
-జనం ఎవరి మాట వినాలి!
-ఇద్దరి మాట విని రెండూ కొనుక్కోవాలి!
-అప్పులు చేసి రెండు కొని నిండా మునగాలి.
-సినిమాలో మొత్తం చెప్పేవి నీతి బోధలు.
-బైట కాసుల కోసం కక్కుర్తి మాటలు.
-నమ్మకాన్ని అమ్ముకోవడం నటులకు కొత్తకాదు,
-ఎన్ని సార్లు నమ్మి మోసపోయినా మనకు బుద్దిరాదు!
-చిరులాభాల కోసం అబద్ధపు వేషాలు…
-జనం బలహీనతలే వారికి కోట్ల సంపాదనలు.
-అబద్ధాల ప్రచారంతో చిరుకు మూటలు!
-విని మోసపోతే మనకు మిగిలేవి చిప్పలు!
-సినిమా అంటేనే అబద్ధం! నటుల ప్రకటనలన్నీ మోసం!!
-రోజూ ఒక గుడ్డు తినండి అంటే నమ్మకం!
-ఫలాన పౌల్ట్రీ గుడ్డు తినమంటే ద్రోహం.
-ఆరోగ్యం కోసం పాలు తాగమంటే మంచిమాట!
-కంట్రీ డిలైట్ పాలు తాగమని చెబితే అందేది మూట!
-నటించే వారిని నమ్మితే నట్టెట మునుగుడే!
-చిరు చెప్పిండని కొంటే చింతలే.
-చరణ్ మాటలు నమ్మితే నరకమే.
-అమ్మే వాడికి ఆస్థులు..కొనేవాడికి కష్టాలు!
-మాటలు చెప్పేవాడికి కాసులు…నమ్మినవాడికి నష్టాలు.
-ప్రజలంతా కల్తీ పాలంటుంటే చిరు కొనుమంటున్నాడు.
-ప్రజల ఆరోగ్యం పాడైతే ఎవరు బాధ్యులు!
నిజం గడప దాటేలోపు అబద్ధం ఆరు ఊర్లు చుట్టి వస్తుందని సామెత. సినిమా కూడా అంతే..సినిమా నటుల మాటలు కూడా అంతే!! వాళ్లు చెప్పేవన్నీ నిజం కాదు. తెరమీద కనిపించేదంతా వాస్తవం కాదు. సినిమా కల్పితమని నమ్మినా అభిమాన హీరో సినిమాలు ఎగబడి చూస్తాం. ఒక రకంగా సినిమా బలమైన మీడియా… సినిమా అనేది కేవలం వినోదాత్మక వస్తువు. కానీ సినిమా నటులను ప్రజలు ఎంతగానో ఆదిస్తారు. అభిమానిస్తారు. అభిమానుల మాత్రం ఆరాధిస్తారు. అదే సినీ నటులకు వరం. తమకు తాముగా గొప్ప వాళ్లమని నమ్మేందుకు సంకేతం. ఆ నమ్మకం ముసుగులో జీవితాంతం బతికేస్తుంటారు. రంగుల ప్రపంచాన్నేలుతున్నామనుకుంటారు. ఇతర ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నామనుకుంటారు. అందుకే సినిమాలన్ని నీతికి, నిజాయితీకి ప్రతీకలుగా తీస్తుంటారు. సందేశాలిస్తుంటారు. అవినీతి మీద యుద్ధం చేస్తుంటారు. దుర్మార్గుల నుంచి సినిమాలో ప్రజలను రక్షిస్తుంటారు. ఇదంతా సినిమా వరకే…తెరమీద నటన వరకే…సినిమా నటుల నటన కాసుల కోసమే…కళ కోసమని చెప్పే మాట పూర్తిగా అబద్దమే! ఇక్కడే జనం తెలుసుకోవాలి. సినిమాను సినిమాగానే చూడాలి. నటుల నటనంతా అక్కడే వదిలేయాలి. కానీ నటుల మాటలు విశ్వసించడం అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే…మనల్ని మనం వంచించుకున్నట్లే…అబద్ధాల జీవితం మనం అలవాటు చేసుకుంటున్నట్లే..ఎప్పుడో ఒకప్పుడు నిండా మునగడం ఖాయమన్నట్లే..అవి ఎలాగో తెలుసుకుందాం.. అభిమాన సినీ జనమంతా మెగాస్టార్‌గా పిలుచుకునే చిరంజీవి సినిమాలలో వేషాలు వేస్తున్న కొత్తలో ఊరికిచ్చిన మాట అనే సినిమా లో నటించారు. ఊరు కోసం తమ్ముడిని డాక్టర్ చేస్తానని ప్రజలకు మాటిస్తాడు. ఆ మాట తమ్ముడు మర్చిపోతాడు. డాక్టర్ అయ్యాక ఊరికి రాడు. ఊరికిచ్చిన మాట కోసం తమ్ముడిని పట్టుకొని ఊరి జనం ముందు నిలబెడతాడు. హీరో అనిపించుకుంటాడు. మరి అదే చిరంజీవి శీతప పానియం థమ్స్‌అప్ తాగమని ప్రచారం చేశాడు. అందులో మోతాదుకు మించి రసాయనాలు కలుపుతున్నారని తెలియడంతో చిరంజీవిని ప్రజలు విమర్శించారు. రక్త దానం, నేత్రదానం అని సామాజిక బాధ్యుడినని చెప్పి అలాంటి ప్రకటనల్లో ఎలా నటిస్తావని నిలదీశారు. దాంతో చిరంజీవి ఆ ప్రకటన నుంచి తప్పుకున్నారు. ఆ ప్రకటన ఒప్పందం రద్దు చేసుకున్నారు. ప్రజల చేత శబాష్ అనిపించుకున్నారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గుడ్డిగా నమ్మేశారు. ఒక అంతర్జాతీయ శీతల పానీయం ప్రకటనకు సంబంధించిన ఒప్పందాలు ఎలా వుంటాయో! ప్రజలకు తెలియదు. మనం ఇటువల నిత్యం చూస్తున్న బిగ్ బాస్ షో లోకి వెళ్లిన వాళ్లు అగ్రిమెంట్ ప్రకారం నిర్వాహకులు చెప్పినట్లు మాత్రమే నడుచుకోవాలి. నిర్వాహకులు పంపించే వరకు హౌస్ లోనే వుండాలి. ఒకవేళ హౌస్ లో వుండలేను అని మొండికేస్తే జరిమానా చెల్లించాల్సి వుంటుంది. ప్రజలను ఎంటర్‌టైన్ చేసే షో కోసమే అన్ని రకాల షరతులు వుంటే, థమ్స్‌అప్ ప్రకటనకు ఎన్ని అగ్రిమెంట్లు వుంటాయో సామాన్యులకు తెలుసా! ఒకసారి కోట్లు ఖర్చుపెట్టి, నటులకు కోట్ల పారితోషికం చెల్లించి తయారు చేసే యాడ్ అగ్రిమెంట్ వదులుకోవడం అంత సులువు కాదు. కానీ చిరంజీవి శీతల పానీయం అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారు. ఎందుకు? కాసుల కోసం అంత పెద్ద యాడ్‌ను వదులు కలవడం సామాజిక సృహతో కాదు. కేవలం అప్పుడే రాజకీయాలలోకి అడుగుపెట్టడం. అంత వరకు పెప్సీ ప్రకటనలో కనిపించిన పవన్ కళ్యాణ్ కూడా వదిలేసుకున్నాడు. కేవలం ప్రజా రాజ్యం కోసం. తాము చేసే ప్రకటనల మూలంగా ప్రజల మనోభావాలు దెబ్బ తినకూడదన్న నిజాయితీ వుంటే ఆ తర్వాత చిరంజీవి మళ్ళీ పారితోషికం కోసం ఎలాంటి ప్రకటనలు చేయరు. కానీ రాజకీయాలకు దూరమై, మళ్ళీ సినీ వేషాలు మొదలు పెట్టిన తర్వాత ప్రకటనలు మొదలుపెట్టారు. ఆ మధ్య శుభ గృహ అనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం ప్రకటనలో నటించారు. మరి చిరంజీవి ఆ శుభగృహలో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నాడా? లేక వారి పారితోషికం తీసుకొని చేతులు దులుపుకున్నాడు. కానీ చిరంజీవి ప్రకటన చూసి చాలా మంది అమాయకులు శుభగృహ వెంచర్‌లో పెట్టుబడులు పెట్టారు. స్థలాలు కొన్నారు. అలాగే చిరంజీవి కుమారుడు రాం చరణ్ కూడా తరతరాలకు చెరగని చిరునామా అని ఊదరగొట్టిన సువర్ణ భూమి రియల్ వ్యాపార ప్రకటన లో నటించారు. తరతరాలేమో గాని కొన్ని వాళ్లను సువర్ణ భూమి చుక్కలు చూపిస్తోంది. అమాయక ప్రజలు సినిమా నటుల మాటలు నిజమని నమ్మి కొనుగోలు చేశారు. మోసపోయామని లబోదిబోమంటున్నారు. సువర్ణ భూమిలో పెట్టుబడి పెట్టి స్థలం కొనమని చెప్పడానికి హెలికాప్టర్ లో దిగుతూ ప్రకటనతో ప్రచారం చేశాడు. ఆ మాటలు నమ్మి కొన్న వాళ్లు రోడ్డు మీద పడుతున్నారు. నన్ను నమ్మండి. నా మాట నమ్మండి. సువర్ణ భూమిలో స్థలం కొనండి. అని చెప్పిన రాం చరణ్ ఇప్పుడు మోసపోయిన వాళ్ల కోసం హెలికాప్టర్ వేసుకొని వస్తాడా? వారికి అండగా నిలుస్తాడా!! సినిమా నటులు తెరమీద వేసేవన్నీ వేషాలే…చెప్పేదంతా అబద్ధపు సూక్తులే. నిజాలు, నీతులన్నీ కల్పితాలే…అందుకే తెర మీద చెప్పేవి శ్రీరంగ నీతులు! బైట దిక్కు మాలిన ప్రచారాలు!! అని ప్రజలంటున్నారు. సినిమా నిండా సామాజిక సూక్తులు! చూపించడం అనేది సినిమా సక్సెస్ ఫార్ములా! అంతే తప్ప సినిమా తీసి చేతులు కాల్చుకోవాలని ఎవరూ చూడరు. డబ్బులు పోగొట్టుకోని రోడ్డు మీద పడాలని ఎవరూ కోరుకోరు. రూపాయి పెట్టుబడి పెట్టి పది రూపాయల లాభం పొందాలనే సినిమా తీస్తారు. నీతి నిజాయితీ వల్లిస్తారు. సినిమాలో నటించాలన్నా నటులు పారితోషికం తీసుకుంటారు. బైట కాసుల కోసమే మోసపు ప్రకటనలు చేయడానికైనా సిద్దపడతారు. ప్రకటన అంటేనే వ్యాపారం. వ్యాపారం అంటేనే ఒక వ్యక్తి ఎదగడానికి మార్గం. లాభాలు ఆర్జించేందుకు అవకాశం. మోసం లేని వ్యాపారం అనేది ఎక్కడా వుండదు. సినీ తారలు వాడే సబ్బు అంటారు. అవి వాడితే చర్మం మృదువుగా అవుతుందంటారు. నిజంగా అవుతుందా? అంటే కాదు. ఒంటినిండా మేకప్ వేసుకొని చేసే ప్రకటన మనం చూస్తాం..అదే నిజమని నమ్ముతాం. ఆ బలహీనతే వ్యాపారులకు లాభాలు. అందుకోసమే ప్రకటనలు. అందుకే నటుల నటనంతా కల్పితం..హీరోల ప్రచారమంతా అబద్ధం! అని మనం గుర్తించాలి. కేవలం హీరోలు సినిమాలో మొత్తం చెప్పేవి నీతి బోధలు అని గుర్తుంచుకోవాలి. వారు నటించే ప్రకటనలన్నీ బైట కాసుల కోసం కక్కుర్తి మాటలుగానే చూడాలి. నమ్మకాన్ని అమ్ముకోవడం నటులకు కొత్తకాదు,
ఎన్ని సార్లు నమ్మి మోసపోయినా మనకు బుద్దిరాదు! చిరులాభాల కోసం అబద్ధపు వేషాలు వేయడం అందరికీ అలవాటే. జనం బలహీనతలతో నటులు ప్రకటనల్లో నటిస్తుంటారు. మొత్తం మీద వారి విని మోసపోతే మనకు మిగిలేవి చిప్పలు! అనే సత్యాన్ని మరవొద్దు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకొని నటించే హీరోలు సామాజిక బాధ్యతను విస్మరించొద్దు. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును సినిమాకు ఖర్చు చేస్తేనే హీరోలకు బతుకు. జనం సినిమాలు చూడడం మానేస్తే హీరోల బతుకు రోడ్డు మీదకు వస్తుంది. రోజూ ఒక గుడ్డు తినండి అంటే నమ్మకం! ఫలాన పౌల్ట్రీ గుడ్డు తినమంటే అది వ్యాపారం.. ఒక రకంగా అది ద్రోహం. ఆరోగ్యం కోసం పాలు తాగమంటే మంచిమాట! కంట్రీ డిలైట్ పాలు తాగమని చెబితే అందేది మూట! అవును. జనమంతా కంట్రీ డిలైట్ పాల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంట్రీ డిలైట్ పాల ప్రకటనే మోసం అంటున్నారు. ఎంత చిక్కని పాలైనా సరే ఉతప్పమ్ అట్టు మందంలో మీగడ రావడం అసాధ్యం. అసంభవం. అలా ఒకవేళ వచ్చిందంటే అది ముమ్మాటికీ మోసం. అలా మీగడ వచ్చేలా పాలు ఇచ్చే గేదెలున్నట్లు ప్రపంచంలో ఎక్కడా విన్నది లేదు. కంట్రీ డిలైట్ పాలలోనే రావడం దుర్లభం. కొంతమంది సాంకేతిక విద్య పరిజ్ఞానం వున్న ఉన్నత చదువులు చదివిన యువకులు కార్పొరేట్ ఉద్యోగాలు వదులుకొని పాల వ్యాపారం మొదలుపెట్టడం ఆహ్వానించ దగ్గ పరిణామమే. చదువుకు పాల వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదు. పాల వ్యాపారం చేయడానికి చదువు అవసరం లేదు. పెద్ద మొత్తంలో పెట్టుబడి వుంటే చాలు. అయితే ఎన్ని రకాల గెదెల పాలు ఒక చోట చేర్చినా సరే కంట్రీ డిలైట్ కంపెనీ చెప్పేంత పాల మీగడ అసాధ్యం. పాలు ఏవైనా సరే పాశ్చరైజ్ చేసినా అందులో కెమికల్ కలపకపోతే ఒక్క రోజులో చెడిపోవడం ఖాయం. పాలు నిలువ చేయడానికే కెమికల్ వినియోగించక తప్పని పరిస్థితి ఎదురైనప్పుడు అట్టులాగా మీగడ పేరుకోవడానికి కెమికల్ వినియోగించకుంటా వుంటారా? అలాంటి పాల ప్రకటనల్లో నటించే చిరంజీవి మాట నమ్మితే నట్టెట మునుగుడే! చిరు చెప్పిండని కొంటే అనారోగ్యం పాలు కావడమే! ప్రజలంతా కంట్రీ డిలైట్ కల్తీ పాలంటుంటే చిరు కొనుమంటున్నాడు. ప్రజల ఆరోగ్యం పాడైతే ఎవరు బాధ్యులు! ఇక చరణ్ విషయానికి వస్తే ఈ తరాన్నే ముంచిన సువర్ణ భూమి? తరతరాల పేరు చెప్పి నమ్మమంటున్న చరణ్ స్వామి. తన మాట మీద మాట మీద నమ్మకముంచాలని అబద్ధం ప్రచారం చేస్తున్నాడు. మరి ఇప్పుడు మునిగిన కస్టమర్లకు ఏం సమాధానం చెబుతాడు! ప్రకటనలో హెలికాప్టర్ లో వచ్చినట్లు వచ్చి బాధితులకు అండగా నిలుస్తాడా? వారి సొమ్ము తిరిగి ఇప్పిస్తాడా! సువర్ణ భూమిలో చరణ్ గుంట కొన్నది లేదు. స్వగృహలో చిరుకు చిన్న ఇల్లు కూడా లేదు. చిరు కంట్రీ డిలైట్ పాలు తాగుతున్నారనడం నిజం కాదు! ఎందుకంటే తన ఫామ్ హౌస్ లో పండిరచే ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించే చిరంజీవి కంట్రీ డిలైట్ పాలు తాగుతున్నామంటే నమ్ముతామా? తనను గుడ్డిగా నమ్మేవారిని తన కాసుల కక్కుర్తి కోసం మోసం చేయడం కాదా? కేవలం కోట్లు తీసుకొని ప్రకటనల చేయడం మాత్రమే నిజం. పాపపు సొమ్ము కోసం నటించే వారు ఎన్ని అబద్దాలెన్నైనా ఆడతారు. చిరు శుభగృహ అన్నాడు! చరణ్ సువర్ణ భూమి కొనమన్నాడు!! జనం ఎవరి మాట విని మోసపోవడం తప్ప ఏమి మిగలదు. సువర్ణ భూమి కొనుగోలు చేసిన వారి పరిస్థితి అదే! ఇంతకన్నా రుజువులేం కావాలి.