మంత్రి రామ్మోహన్‌నాయుడు
· మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడిగా ప్రవేశం

· పౌర విమానయాన మంత్రిత్వశాఖను సమర్థవంతంగా నిర్వహణ
· ఐదేళ్లలో దేశంలో 50 విమానాశ్రయాలు నెలకొల్పే లక్ష్యం
· విద్యావంతుడు కావడంతో వివిధ కేంద్ర కమిటీల్లో స్థానం
· ఏపీలో రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన నేత
· శ్రీకాకుళంలో తిరుగులేని పట్టు సాధించిన సమర్థనాయకుడు
· తెలుగుదేశం అండతో రాజకీయ ప్రస్థానం
· అంచెలంచెలుగా దూసుకుపోతున్న వైనం
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న కింజరపు రామ్మోహన్‌నాయుడుతెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, దివంగత మాజీ కేంద్ర మం త్రి, ఎర్రంనాయుడు తనయుడు. మంచి విద్యావంతుడు, ప్రధాని మోదీ మంత్రివర్గంలోకి తీసు కున్న అతి పిన్న వయస్కుడు కూడా ఈయనే! ఎప్పుడూ చిరునవ్వుతో, నిగర్విగా, పెద్దల పట్ల గౌరవంతో మెలిగే రామ్మోహన్‌నాయుడు, తన మంత్రిత్వశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మంత్రిగా పేరుపడ్డారు. ఆయన మొత్తం మూడుసార్లు 16వ, 17వ, 18వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహి స్తున్నారు. 2014లో మొట్టమొదటిసారి తెలుగుదేశం తరపున లోక్‌సభకు ఎన్నికైన ఆయన, 2019, 2024 సంవత్సరాల్లో కూడా అదే పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించి స్థానిక రాజకీయంలో తన పట్టును నిలుపుకున్నారు. అంతేకాదు ఆయన టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. అంతేకాదు లోక్‌సభలో టీడీపీ పక్ష నాయకుడు కూడా! పుర్ డ్యూ యూనివర్సిటీనుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఎస్‌సీ పూర్తిచేసి, లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీనుంచిఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. 2024 జూన్ 9న ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మం త్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ శాఖను నిర్వహిస్తున్న 33వ మంత్రి ఈయన!
మంత్రిగా ఆయన విమానయాన రంగంలో మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మంత్రిత్వశాఖ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో దేశంలో 50 కొత్త విమానాశ్రయాలు నెలకొల్పాలన్నది ఆయన సంకల్పం. 2047 నాటికి దేశంలో 350 ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా వచ్చే ఐదేళ్ల కాలంలో 50 కొత్త విమానాశ్రయాలు నెలకొల్పే ప్రక్రియను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, విమాన ప్రమాదాలపై విచారణను మరింత పారదర్శకంగా నిర్వహించడం, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు కూడా. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగు తున్న నేపథ్యంలో సురక్షిత విమాన ప్రయాణాలపై ఆయన ప్రధానంగా దష్టి కేంద్రీకరిస్తున్నారు. ముఖ్యంగా దేశీయ విమానాల నిర్వహణను మరింత సరళతరం చేయడమే కాకుండా, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేకించిన ప్రాంతీయ రూట్లలో విమాన ప్రయాణాలను సామాన్యులకు మరింత అందుబాటు లోకి తెచ్చేందుకు వీలుగా ఆయా మార్గాల్లో ఫిక్స్‌డ్ రేట్లను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా “ఫేర్ సే ఫర్‌సత” వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సాంకేతిక పరంగా వైమానిక రంగాన్ని మరింత పరిపుష్టం చేసే ప్రక్రియలో భాగంగా బెంగళూరులో ఎయిర్‌బస్‌కు సంబంధించి ‘ఇండియా టెక్నాలజీ సెంటర’ను ప్రారంభించారు. ప్రాజెక్టు టైమ్ లైన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆయన ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో, కింజరపు ఎర్రంనాయుడు, విజయకుమారి దంపతులకు 1987 డిసెంబర్ 18న రామ్మోహన్‌నాయుడు జన్మించారు. ఎర్రంనాయుడు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించేవారు. తర్వాతి కాలంలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 1996`98 మధ్యకాలంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిగా పనిచేశారు. రామ్మోహన్‌నాయుడు తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని శ్రీకాకుళంలో పూర్తిచేసి తర్వాత, ఢిల్లీలోని ఆర్.కె.పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసంకొనసాగించారు. తర్వాత యు.ఎస్.లోని పుర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచులర్ డిగ్రీని పూర్తిచేశారు. అనంతరం లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. భారత్‌కు రాకముందు ఏడాదికాలం సింగపూర్‌లో ఉద్యోగం చేశారు. ఈయన బాబాయి కింజరపు అచ్చంనాయుడు టీడీపీలో సీనియర్ నాయకుడిగా వున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.
రామ్మోహన్‌నాయుడు 2017లో శ్రావ్య బండారును వివాహమాడారు. ఈమె తెలుగుదేశం పార్టీకిచెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె. 2012లో తండ్రి ఎర్రం నా యుడు కారు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2013లో శ్రీకాకు ళం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీచేసి 127576 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎంపీగా ఆయన, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఒక ప్రైవేటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 327901 ఓట్ల మెజారిటీతో అప్రతిహత విజయాన్ని నమోదు చేశారు. తర్వాత ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్‌లో కేం ద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇప్పటికీ ఇదే పదవిలో కొ నసాగుతున్నారు.
పార్లమెంట్‌కు హాజరు కావడంలో రామ్మోహన్‌నాయుడు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. పార్లమెంట్‌కు సభ్యుల సగటు హాజరు 84% వుండగా, ఈయన 90% హాజరుతో పార్లమెంట్ సభ్యుడిగా తన నిబద్ధతను చాటిచెప్పారు. ఈయన హాజరు రాష్ట్ర సగటు హాజరు 79% కంటే కూడా అధికం కావడం గమనార్హం. ఆయన ఇప్పటివరకు పార్లమెంట్‌లో 69 ప్రశ్నలు లేవనెత్తా రు. ఇది జాతీయ సగటు 49, రాష్ట్ర సగటు 49 కంటే అధికం. ఇక 34 పార్లమెంట్ చర్చల్లో పాý£్గన్నారు. ఇది రాష్ట్ర సగటు 13, జాతీయ సగటు 14.5 కంటే ఎక్కువ! ఈ విశ్లేషణను పరిశీలి స్తే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తన విధిని చక్కగా నిర్వర్తిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఆయన రైల్వే, ీVAం వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో, పర్యాటకÊ సాంస్కతిక మంత్రిత్వశాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ, 16వ లోక్‌సభలో అధి కార భాషా శాఖలో సభ్యులుగా పనిచేశారు.
ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 72వ సమావేశానికి ఆయన భారత్ తరపున ప్రాతినిధ్యం వ హిస్తూ, నిరాయుధీకరణపై ఏర్పాటు చేసిన మొదటి కమిటీ 22వ సమావేశంలో పాý£్గన్నారు. బహుపాక్షిక సహకారం ద్వారా, ఐరాసా ఆదర్శాలకు అనుగుణంగా ప్రపంచ శాంతికి భారత్ కట్టు బడి వున్నదని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. అంతేకాదు అణు నిరాయుధీకరణ, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక యత్నాల ప్రాధాన్యతను ఆయన స్పష్టంగా వివరించారు.
2019లో న్యూస్ మినిట్‌లో వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి పాలనను విమర్శిస్తూ ఒక వ్యాసం రాసారు. మే నుంచి సెప్టెంబర్ వరకు ఇసుకపై నిషేధం విధించడం వల్ల రాష్ట్రంలో నిర్మాణరంగం దెబ్బ తింటుందని తన వ్యాసంలో స్పష్టం చేశారు. ఇదే సమయంలో 20లక్షల మంది కూలీలు తమ జీవనోపాధిని కోల్పోతారని కూడా ఆయన వివరిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.