రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోకల శశిధర్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించడం పట్ల రుద్రంగి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేసి యువకుడిని
ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ ఉద్యోగం సాధించిన శశిధర్ కు శుభాకాంక్షలు
తెలియజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ . శశిధర్ పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించడం
రుద్రంగి గ్రామానికి ఎంతో గర్వకారణం అన్నారు… నేటి యువత
సమయాన్ని వృధా చేయకుండా
శశిధర్ ను ఆదర్శంగా తీసుకొని
పట్టుదలతో చదువితే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు మంచి భవిష్యత్తు
ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు ఎల్ల గంగాధర్, గాజ నరసయ్య, దేశ వేణి శ్రీనివాస్, దేశ వేణి విక్రమ్, ధ్యావల దిలీప్, దినేష్, తోకల నరసయ్య, లక్ష్మణ్, శరత్, రాము, మనోజ్ ,తదితరులు పాల్గొన్నారు.
