# పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గులాబీ దళంలో జోష్ పట్ల ప్రణాళికలు..
# ప్రకటన విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
# హాజరు కానున్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ..
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు సబ్బండ జాతులను ఏకం చేసిన తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం తన భుజాలపైన వేసుకొని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచారు.కాగా ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఐనప్పటికీ త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో గులాబీ పార్టీ పట్టుదలతో ముందుకెళ్తున్నది.ఐతే నర్సంపేట నియోజకవర్గం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఈ నెల 29 న రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.పట్టణంలోని పద్మశాలి గార్డెన్స్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుందన్నారు.ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గ ముక్య నాయకులు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, సొసైటీ ఛైర్మన్లు, క్లస్టర్ భాద్యులు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, గ్రామ, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సోసైటి డైరెక్టర్లు,వార్డు సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల భాద్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్, పార్టీ నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి భాద్యులు, తదితరులు పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.