బూతులు తిట్టుకొని కారు వాళ్లు కొట్టుకున్నారట!?

బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధి సీనియర్ నాయకుల మధ్య గొడవ.!?

పార్టీ మండల స్థాయి పెద్ద పోస్ట్ లేదంటే సర్పంచ్ కు పోటీ చేస్తా గొడవకు కారణం.!?

గ్రామ పంచాయితీ పరిధి భూమి ఓ నాయకుడు ఆక్రమణ కొరకు గొడవకు దారి అని సమాచారం.!?

సీనియర్ నాయకుడు సద్దు చెప్పిరా ఆగని గొడవ ఇదేమి లొల్లి ఆలోచించుకునే క్రమంలో బోల్తా పడ్డ నాయకుని వాహనం.!?

ప్రస్తుతం మండలంలో ఇదే హాట్ టాపిక్ చెప్పుకుని నవ్వుకుంటున్నారు జనం.!?

మహాదేవపూర్- నేటి ధాత్రి:

టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకుల మధ్య గణతంత్ర దినోత్సవం సాక్షిగా ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంట్లో సమావేశమై ఇద్దరు ప్రజా ప్రతినిధులు మరో ఇద్దరు సీనియర్ పార్టీ నాయకుల మధ్య బూతుల పురాణంతో గొడవ ప్రారంభం ఐ చివరికి ఒకరిపై ఒకరు చేయి వేసుకునే పరిస్థితికి వచ్చినట్లు విశ్వనీయ సమాచారం. శుక్రవారం రోజున అంతర్గతంగా జరిగిన భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధుల సీనియర్ పార్టీ నాయకుల మధ్య జరిగినటువంటి గొడవ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రస్తుతం మహాదేవపూర్ మండల కేంద్రంలో ఒక హార్ట్ టాపిక్ గా మారింది. అలాగే ఓ సీనియర్ నాయకుడు గొడవలు శాంతింప చేసే ప్రయత్నం చేసినప్పటికీ గొడవ శాంతించకపోవడం అక్కడి నుండి బయలుదేరిన ఆ సీనియర్ నాయకుడు మనస్థాపం చెంది ఉండడంతో వాహనం నడపడంలో కాస్త ఇబ్బంది కలిగి వాహనం బోల్తా పడినట్లు విశ్వనీయ సమాచారం.

బూతులు తిట్టుకొని కారు వాళ్లు కొట్టుకున్నారట!?

మహాదేవపూర్ మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి ఒక సీనియర్ గాయకుడు ఇంట్లో బి ఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు సీనియర్ నాయకులు అలాగే ప్రజా ప్రతినిధులు కలిసి ఒక అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశం లో నాయకుడు పలు ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కూడా పిలవడం జరిగింది. ప్రజా ప్రతినిధులు హాజరైన అనంతరం రాబోయే పంచాయితీ ఎన్నికల విషయం తో పాటు పార్టీలో పెత్తనంపై పలు అంశాలను చర్చించుకోవడం జరిగిందట, అదే క్రమంలో పలు సీనియర్ నాయకులు తాము కూడా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీకు ఉంటామని లేదంటే స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తామని, మరొకరు పార్టీలో పెత్తనం కొరకు తమకు ప్రధాన పదవులు కావాలని ప్రస్తుత ప్రజా ప్రతినిధులు సహకరించాలని తెలపడంతో గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ప్రజా ప్రతినిధులు సీనియర్ డిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య నువ్వెంత నీ బతుకెంత నీ గురించి మాకు తెలవదా నువ్వు చేసిన పని ఏమిటి అంటూ ఒకరిపై ఒకరు పెద్ద మొత్తంలో బూతుల పురాణం ప్రారంభించారని సమాచారం. ఇక్కడితో ఆగని నాయకులు ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు చేయి కూడా వేసుకోవడం జరిగిందని విశ్వనీయ సమాచారం.


పార్టీ మండల స్థాయి పెద్ద పోస్టు లేదంటే లేదంటే సర్పంచ్ కు పోటీ చేస్తా గొడవకు కారణం.!?

మాదాపూర్ మండల భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకుల మధ్య జరిగిన గొడవకు ప్రధాన కారణం సర్పంచ్ ఎన్నికల్లో మహదేవ్పూర్ సర్పంచ్ గా పోటీ చేస్తామని సీనియర్ నాయకులు ప్రస్తుత ప్రజాప్రతినిధులు తమకు సహకరించాలని ప్రధాన డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమావేశంలోని మరికొందరు నాయకులు పార్టీలో మండల స్థాయి పెద్ద పదవులకు కూడా అధిష్టానానికి తమ పేరును ప్రతిపాదించాలని మద్దతు తెలిపాలని ప్రజా ప్రతినిధులకు కోరడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి కు చెందిన వారు సర్పంచ్ పోటీ తో మండల స్థాయి పెద్ద పదవులకు తరించడంతో ఒకరిపై ఒకరు తిట్ల పురాణం తో పాటు పెద్ద మొత్తంలో గొడవ జరిగి రెండు వర్గాల మధ్య కొట్టుకున్నట్లు మండలమంతా మారుమోగుతుంది.

గ్రామ పంచాయితీ పరిధి భూమి ఓ నాయకుడు ఆక్రమణ కొరకు గొడవకు దారి అని సమాచారం.!?

భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు సీనియర్ పార్టీ నాయకుల మధ్య జరిగిన అంతర్గత గొడవ వ్యవహారంలో మరో ప్రధాన విషయం చర్చనీయంగా మారింది గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రభుత్వ గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి కొందరు సీనియర్ పార్టీ నాయకులు ఒక ప్రజా ప్రతినిధి ఆ భూమిపై గత కొన్ని రోజులుగా కన్నేసి ఎలాగైనా తమ సొంతం చేసుకుంటారని ఆలోచనలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రజాప్రతినిధులు అంతర్గత భేటీలో మరో ప్రధాన విషయం తెలుస్తుంది. పంచాయతీ పరిధిలోని భూమిని ఆక్రమించుకోవడం సమంజసం కాదని తెలపడంతో ఆగ్రహించిన సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధి ఒకరిపై ఒకరు దాడులకు పడినట్లు తెలుస్తోంది.

సీనియర్ నాయకుడు సద్దు చెప్పిరా ఆగని గొడవ ఇదేమి లొల్లి ఆలోచించుకునే క్రమంలో బోల్తా పడ్డ నాయకుని వాహనం.!?

అంతర్గతంగా సమావేశమై గొడవకు కారణమైన పలు ప్రధాన అంశాలు సర్పంచ్ పోటీ తోపాటు మండలంలో పెద్ద పోస్టు అలాగే పంచాయతీ పరిధిలోని భూమి ఆక్రమణ లాంటి విషయాలు బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకుల మధ్య పెద్ద మొత్తంలోనే గొడవ జరగడం సుమారు నాలుగు గంటల పాటు వ్యవహారంపై చర్చించుకోవడం తోపాటు తిట్ల పురాణాలకు అలాగే చివరికి ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకోవడం అంతేకాకుండా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంబంధించి మద్యం డబ్బు లాంటి విషయాల్లో ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు వాడుకోవడం జరిగిందని కొందరు సీనియర్ నాయకుడు గొడవలో చెప్పడం జరిగిందని అంతేకాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కు చెందిన ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు పలు సీనియర్ నాయకులు చేసిన అక్రమాలను కూడా పలువురు సీనియర్ నాయకులు బయట పెడతామని చెప్పడం జరిగిందని సమాచారం. ఇదే క్రమంలో అంతర్గత భేటీలో ఉన్న ఒక టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులను గొడవకు శాంతింప చేసే ప్రయత్నం అనేకమార్లు చేసినప్పటికీ అతనిపై కూడా అనేక రకాల ఆరోపణలు జరిగిందని, అనంతరం ఒక సీనియర్ నాయకుడు తిరిగి వెళుతున్న క్రమంలో మండల కేంద్రంలో జరిగినటువంటి వ్యవహారాన్ని ఆలోచిస్తూ వాహనాన్ని నడుపుతున్న టిఆర్ఎస్ పార్టీ సీనియర్ గుడి వాహనం అదుపుతప్పి బోల్తాపడడం జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం మండలంలో మండల వి ఆర్ ఎస్ పార్టీ లో మొత్తంలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని తెరపైకి రావడం అలాగే ప్రజా ప్రతినిధులు సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మధ్య పెద్ద మొత్తంలో చప్పుడు కాకుండా దాడి కూడా చేసుకోవడం ప్రస్తుతం మహాదేవపూర్ మండలంలో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మండలమంతా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులపై అలాగే సీనియర్ నాయకుల బులహారం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకోవడం విశేషం.

ప్రస్తుతం మండలంలో ఇదే హాట్ టాపిక్ చెప్పుకుని నవ్వుకుంటున్నారు జనం.!?

మహదేవ్పూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ సాక్షిగా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకుల మధ్య తోపులాట బూతుల పురాణం గొడవ నుండి వెళ్లిపోయిన ఆ సీనియర్ వాహనం అదుపుతప్పి బోల్తాపడడం ఇలాంటి విషయం ప్రస్తుతం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎదురుదెబ్బ కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితికి రాబోయే ఎన్నికల్లో మండల గ్రామాల స్థాయి నుండి ఓటర్లను గత ప్రభుత్వం చేసిన పనులను వాస్తవికతను ప్రజల్లోకి తీసుకువెళ్లే మండల స్థాయి ప్రజా ప్రతినిధులు పదవులు పార్టీలో విత్తనాల కోసం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం ఒకరి అవినీతి ఒకరు బయట పెట్టడం అని బ్లాక్ మెయిల్ చేయడం భారత రాష్ట్ర సమితి పార్టీకి మండల స్థాయి ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకుల నుండి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది కలిగే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుందని ప్రజల్లో వస్తున్న వార్తలు. ప్రజల కోట్ల ద్వారా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య కీలక పాత్ర పోషించాల్సినటువంటి సీనియర్ భారత రాష్ట్ర సమితి నాయకులు మండలంలో ఎన్నికల్లో పోటీ భూముల ఆక్రమణ విషయంలో గొడవలు చేసుకోవడం జరిగిందన్న విషయం కాస్త ఆలస్యంగా తెరపైకి రావడం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే పంచాయతీ ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ప్రజల నుండి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడక తప్పడం లేదు. ఏది ఏమైనా ఈ వివాహం ఎక్కడికి దారితీస్తుందో దీనిపై బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ మరియు జిల్లా ఇన్చార్జీలు ఎలా స్పందిస్తారు వేచి చూడాల్సిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version