నిజాంపేట, నేటి ధాత్రి
ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కార్యదర్శి భాగ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు బిపి, షుగర్, టెంపరేచర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికార ఆదేశాల మేరకు గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గౌరీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.