ముస్లింలకు సోదరులకు రంజాన్ తోఫా కనుక…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండల బోపన పల్లి గ్రామంలో పేద ముస్లింలకు రంజాన్ పండుగ కానుకగా మండలానికి ఐదు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు సర్పంచ్ అమృత్ ఉప్పు సర్పంచ్ రాములు మజీద్ సదర్ నిజామోద్దీన్ రుక్ముద్దీన్ అన్నారు. పార్టీ మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు పెద్దపీట వేస్తుందని, రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న Ⓒప్రతి పేద ముస్లిం కుటుంబానికి తోఫాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడుతుందని పార్టీ మైనారిటీ అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జహీరాబాద్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని ఝరాసంగం మండల ఒక్కొక్క గ్రామానికి ఐదుగురు పేద ముస్లింలకు గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేయడంతో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
