అభివృద్ధి,సంక్షేమం చూసే ప్రజల్లో చైతన్యం
మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్
కేసముద్రం(మహబూబాబాద్)నేటి ధాత్రి:
బిఆర్ఎస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు,కెసిఆర్ పరిపాలన పై ఆకర్షితులై వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు.కేసముద్రం పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అర్పణపళ్లి, అన్నారం,తౌర్య గ్రామాల నుండి దాదాపు 300 మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తక్కువ సంవత్సరాలు అవుతున్న కానీ అభివృద్ధి సంక్షేమంలో ఎంతో ముందు ఉందని అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఉండడంవల్ల వివిధ పార్టీల నుండి అనేకమంది ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.దేశంలో మరెక్కడా లేని విధంగా సాగునీరు, తాగునీరు అందిస్తూ ఉందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు, రైతుబంధు,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,కేసిఆర్ కిట్టు,దళిత బందు, బీసి బందు వంటి అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు.ఎన్నో సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారంగా బ్రతుకుతున్న రైతులకు వారికి హక్కు పత్రాలు ఇవ్వడమే కాకుండా బ్యాంకులో రుణం పొందేలా,రైతు బీమా వంటి సదుపాయం కల్పించారని అన్నారు.అలాగే ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరు అండగా ఉండి కేసీఆర్ ను మూడోసారి గెలిపించాలని,అలాగే మహబూబాబాద్ లో బిఆర్ ఎస్ జండా మూడోసారి ఎగరాలని ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్ జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి,రావుల నవీన్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాదారం సత్యనారాయణ,రావుల రవిచంద్ర రెడ్డిమార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్,మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్,సట్ల వెంకన్న,మహమ్మద్ నజీర్ అహ్మద్,కమటం శ్రీను,పట్టణ అధ్యక్షులు వీరు నాయక్,రవి నాయక్,కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, మహేశ్వర చారి,గంధసిరి సోమన్న,షేక్ జాని, శతకోటి నరేష్,హరి నాయక్,కూన భద్రాద్రి, భీమ నాయక్,మహేందర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఆ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.