ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటిధాత్రి:-
ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో శుక్రవారం రోజున మారుతి ఆటో యూనియన్ సభ్యులందరూ కలిసి అధ్యక్షులుగా పిట్టల ప్రశాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులు గా తిప్పారపు రమేష్,ప్రధాన కార్యదర్శిగా బొంగోని అనిల్,క్యాషియర్ గా ఆనం సతీష్,సంయుక్త కార్యదర్శి ఎండి యాకుబ్ పాషా,ప్రధాన కార్యదర్శి ఎం డి ఆసిఫ్ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా మారుతి ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన పిట్టల ప్రశాంత్ మాట్లాడుతూ మారుతి ఆటో యూనియన్ కుటుంబ సభ్యులంతా నాపై నమ్మకంతో రెండవసారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పేరు పేరునా ఆటో యూనియన్ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆటో సోదరులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వారి వెంటే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.