నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలా పూర్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 75 వగణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ మాధవి,ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ బాబు,పోలీస్ స్టేషన్ లో సిఐ సంజీవ్,వివిధ గ్రామాల్లో సర్పంచ్ లు,పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఆవిష్కరించారు.వివిధ పాఠశాలలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.బహుమతులు మిఠాయిల్ పంచిపెట్టారు.