ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి,ఎల్ రవి
మంగపేట నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మేనక మేడం మాట్లాడుతూ, విద్యార్థులకు ఇలాంటి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం చాలా అభినందనీయమని, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి
మాట్లాడుతూ త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టేందుకు, వారిలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుందని అన్నారు…..
చాలామంది విద్యార్థులు పరీక్షలు అనగానే భయం మొదలవుతుంది, ఆ భయంతో ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,
అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి ఈ టాలెంట్ టెస్ట్ 100% ఉపయోగపడుతుందని అన్నారు….
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు జాడి యుగెందర్,మండల కమిటీ సభ్యులు రహీమ్ ,కేశవ తది తరులు పాల్గొన్నారు