పంబాల కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రౌతు హరికృష్ణ
నర్సంపేట,నేటిధాత్రి:
మరుగునపడిన పంబాల కులమును కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో గుర్తించి ఏ కేటగిరిలో చేర్చినందున మందకృష్ణ మాదిగ జీర్ణించుకోలేక పోతున్నారని వరంగల్ జిల్లా పంబాల కుల సంఘం అధ్యక్షుడు రౌతు హరికృష్ణ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంబాలకులాన్ని ఏ కేటగిరిలో చేర్పించడం ఏమిటంటూ కులాన్ని ఉద్దేశించి మందకృష్ణ మాదిగ చేసిన తప్పుడు వ్యాఖ్యలను పంబాల కులస్తుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీలో బిళ్ళును ఆమోదించి మూడు గ్రూపులుగా విభజించగా, ఏ గ్రూపులో నమోదైనటువంటి పంబాల కులంను ఇంకా మరుగునపడేసేలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ, ఏ కేటగిరినుంచి పంబాల కులాన్ని లాగిపడేసే విధంగా మందకృష్ణ మాదిగ అబద్ధాల వ్యాఖ్యలు చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు.పంబాల కులంను ఏ గ్రూపులో తీసుకురావడంలో కుట్ర జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం ఏమాత్రం సరైనది కాదని ఆయన అన్నారు. గంట చక్రపాణి ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఆయనది పంబాల కులం ఆకులం ఏ గ్రూపులో ఎలా వస్తుందని మందకృష్ణ మాదిగ మాట్లాడిన మాటలు అవాస్తవమని ఆయన పంబాల కులమని ఏరోజు చెప్పుకోలేదని అన్నారు. మందకృష్ణ మాదిగ ఫ్రస్టేషన్లో పంబాల కులం మీద పడి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. నేతకాని కులంవారు అత్యంత వెనుకబడిపోయి ఉన్నారని అతను అన్నారు,మరి నేతకాని కులములో గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు, అంటే గంట చక్రపాణి పంబాల కులం నుండి ఒక ఉద్యోగిగా ఉంటే నేతకాని కులం నుండి చట్టసభల్లో ఉండడంపై సమాధానం చెప్పాల్సిన అవసరం మందకృష్ణ మాదిగకు ఉందన్నారు. బీజేపీ ఎజెండాతో కులాల మధ్య కొట్లాట పెట్టి రాజ్యాంగాన్ని తీసివేయాలనే కుట్రలో మందకృష్ణ మాదిగ పావుగా మారాడనేది స్పష్టమవుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పంబాల కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గడ్డం రాజయ్య, జిల్లా గౌరవ సలహాదారులు గడ్డం మొగిలి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ లింగమూర్తి, ప్రచార కార్యదర్శి మేదరి సురేష్, పంబాల నాయకులు బోడ దిలీప్, బోడ కిరణ్, బోడ రాజయ్య, మేదరి వీరమల్లు, మేదరి విజయ్, గడ్డం నరేందర్, బోడ చిన్న తిరుపతి, బోడ రాజనర్స్, బోడ రాజీరు, తదితరులు, పాల్గొన్నారు.