చెన్నూర్, నేటి ధాత్రి:
ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ,11000 ల సభ్యులతో 9 దేశాలలో విస్తరించి, ఐ ఎస్ ఓ గుర్తింపు పొంది, నిరంతర సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలతో 28 ప్రపంచ రికార్డులను సాధించినటువంటి ఏకైక సాహిత్య సంస్థ శ్రీ శ్రీ కళావేదిక. అటువంటి మహోన్నతమైన శ్రీ శ్రీ కళావేదిక సంస్థకు మన చెన్నూరు వాసి మామిడి అక్షిత రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. శ్రీ శ్రీ కళావేదిక స్థాపకుడు చైర్మన్ కత్తిమండ ప్రతాప్ మామిడి అక్షిత ని తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షురాలుగా నియమించారు. ఈ సందర్భంగా మామిడి అక్షిత మాట్లాడుతూ 2022 లో తన స్వీయ రచన సిరామృతం ముద్రణతో పరిచయమైన శ్రీశ్రీ కళాకారుల వేదిక నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ
రాష్ట్ర స్థాయి వరకు తీసుకువచ్చిందని, శ్రీ శ్రీ కళావేదిక అందించిన ప్రోత్సాహాన్ని ఏనాటికి మర్చిపోనని, తోటి కళాకారులు చూపిన ఆదర అభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ,రాష్ట్ర యువజన అధ్యక్షురాలుగా నియమించబడటం సంతోషకరంగా ఉందని, ఈ బాధ్యతని చిత్తశుద్ధితో, న్యాయబద్ధంగా, తోటి కళాకారులను ప్రోత్సహించే విధంగా వినియోగిస్తానని, శ్రీ శ్రీ కళావేదిక అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. అలాగే శ్రీ శ్రీ కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లంకదాసరి అశ్విని, రాష్ట్ర కార్యదర్శులుగా మాంకాళి సుగుణ, బోనాసి రేణుక నియమితులయ్యారు. నూతన కార్యవర్గానికి శ్రీ శ్రీ కళావేదిక టీం శుభాకాంక్షలు తెలిపారు.