మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బీజేపీతోనే భారతదేశ అభివృద్ది సాద్యం అన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఆధిష్టనం సూచనలతో ఈనెల 20 నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో విజయ సంకల్ప్ బస్సుయాత్ర చెపట్టినట్లు తెలిపారు. మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణా మండలం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర రోజుకి 2 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పిన మూడ్రోజుల పాటు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలోని అన్ని మండలాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
యాత్ర ప్రధాన అజెండా
బీజేపీ చేపట్టిన ఈ విజయ సంకల్ప్ బస్సు యాత్రలో.. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శకమైన పాలనా తీరును ప్రజలకు ఈయాత్రలో వివరిస్తామని తెలిపారు డీకే.అరుణ. అలాగే మండలాల వారీగా ప్రధానమైన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై స్పష్టమైన హామీలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలు భాగస్వాములవ్వండి బలపర్చండి.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ చేపట్టిన ఈ బృహత్తర కార్యాక్రమం విజయ సంకల్ప్ బస్సు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు డీకే.అరుణ. ఈ యాత్రలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల నుంచి ప్రజలు , మహిళలు, బీజేపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.