141వ మే డే వారోత్సవాలు జయప్రదం చేయండి-టేకుమల్ల సమ్మయ్య..

141వ మే డే వారోత్సవాలు జయప్రదం చేయండి-టేకుమల్ల సమ్మయ్య

కరీంనగర్, నేటిధాత్రి:

141వ మే డే వారోత్సవాలు కరీంనగర్ జిల్లాలో విజయవంతం చేయాలని టేకుమల్లసమ్మయ్య పిలుపునిచ్చారు. ఏఐటీయుసీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం బద్ద ఎల్లారెడ్డి భవన్ లో జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగినది. ఈసందర్భంగా మే డే వాల్ పోస్టర్ ను ఏఐటియుసి జిల్లా కార్యాలయం బద్ద ఎల్లారెడ్డి భవన్ లో ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ 1886లో పనిగంటలు తగ్గించాలని,పని భద్రత కల్పించాలని బానిసత్వం నుండి విముక్తి చేయాలని జరిగిన విరోచిత పోరాటంలో బ్రిటిష్ పోలీస్ మూకల తుపాకీ తూటాలకు నేలకొరిగిన కార్మికుల రక్తంలో ముంచి ఎత్తిన జెండా ఎర్రజెండాఅని వారిని స్మరించుకోవడానికి మే ఒకటవ తేదీన అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, కంపెనీలొ, కార్ఖానాల్లో, లేబర్ అడ్డాలలో ఎర్ర జెండాలు ఎగిరేసి వారికి జోహార్లు అర్పించి వారిని స్మరించుకోవడం జరుగుతుందన్నారు. నేడు మతోన్మాద శక్తులు ఆనాటి త్యాగాలతో వచ్చిన హక్కులను కాలరాస్తు సంస్కరణల పేరుతో ఇరవై తోమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టివేయాలని చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికి కార్మిక వర్గం వీరోచిత పోరాటాలకు సిద్ధం కావాలని టేకుమల్ల సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలొ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షులు కాసెట్టి లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య, పిట్టల శ్రీనివాసు, బెజ్జంకి కాళిదాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసు, ఆగయ్య, రాజు, కుమారు ఓదెలు , మల్లేశం, బొజ్జ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version