పూలే 135వ వర్ధంతి సభను విజయవంతం చేయండి
కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శరత్
పరకాల,నేటిధాత్రి
సిపియుఎస్ఐ నాయకులు శనిగరపు బిక్షపతి అధ్యక్షతలో పట్టణంలోని అమరదామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి,రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గడ్డం శరత్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక విప్లవకారుడు బహుజన ఉద్యమాల పొద్దుపొడుపు మహాత్మ జ్యోతిరావు పూలే త్యాగాల చరిత్రను నేటి సమాజానికి తెలియజేయడం కోసం ఈనెల 30వ తారీఖున వరంగల్ లో చింతల్ బ్రిడ్జి రైతు భవన్ లో జరిగే పూలే 135వ వర్ధంతి కార్యక్రమ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
