బర్లగూడెం మాజీ సర్పంచి ఆదివాసీ నవనిర్మానసేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి..
బాండ్ మొక్కజొన్న పంటలను క్షేత్ర స్థాయి పరిశీలన..
°అన్నదాలకు అండగా ఉండాలని ప్రజలకు పిలుపు..
°ఆర్గనైజర్ల వందల కోట్ల అక్రమాల పైన విచారణ చేపట్టాలని డిమాండ్..
నూగూర్ వెంకటాపురం ఫిబ్రవరి 20 ( నేటి ధాత్రి ):-
అన్నదాతలకు అండగా నిలవడం సమాజ సామాజిక బాధ్యత అని మాజీ సర్పంచి కొర్స నర్సింహా మూర్తి పేర్కొన్నారు. బుధవారం ఆయన వాజేడు మండలం లోని ఆరుగుంట పల్లి, వెంకటాపురం మండలం లోని రాచపల్లి, మొట్లగూడెం గ్రామాల్లో సాగు చేసిన మొక్క జొన్న పంటలను క్షేత్ర పరిశీలన చేశారు.ఆరుగుంటపల్లి రైతులు గత సంవత్సరం నుండి సింజెంట మొక్కజొన్న సాగు చేస్తూ దిగుబడి రాక నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు అని అన్నారు. గత ఏడాది ఇదే విత్తనం వేసి దిగుబడి రాక నష్టపోతే నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారని అన్నారు. ఈ ఏడాది కూడా రైతులు వేయబొమని చెప్పినప్పటికి దిగుబడి రాకపోతే నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చినట్టు ఆయన తెలియజేసారు. బహుళ జాతి మొక్క జొన్న విత్తన కంపెనీల ఏజెంట్ల మాటలు నమ్మి మొక్కజొన్న పంటలు వేసి తీవ్రంగా నష్టపోయమని రాచపల్లి, మొట్లగూడెం రైతులు తెలిపినారని అన్నారు. రాజకీయ పార్టీల ముసుగులో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ రాజకీయాల్లో కొనసాగడం సిగ్గు చేటన్నారు. రాజకీయాలను వ్యాపారాలుగా మార్చుకొని పబ్బం గడుపుతు న్నట్లు మండిపడ్డారు. బాండ్ వ్యవసాయం అని నోటి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన రైతులకు కంపెనీ నియమ నిబంధనల ప్రకారం నేరుగా రైతు ఖాతాలోనే వేయాలని డిమాండ్ చేశారు. ఆర్గనైజర్ల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు.మొక్క జొన్న కుంభకోణం పైన సమగ్రవిచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ని కోరారు . రెండు మండలాల్లోని మొక్కోజొన్న రైతులు కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. నాయకులు కుంజ మహేష్, పాయం రాంబాబు, ప్రవీణ్, పర్శిక సురేష్ మొక్కజొన్న రైతులు ఉన్నారు.