మందమర్రి, నేటిధాత్రి:-
తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పట్టణానికి చెందిన మహంత్ అర్జున్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి అర్జున్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ఇంచార్జ్ గా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి, తనకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత చైతన్యవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ మరింత బలోపేతం కావడానికి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి, కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా కృషి చేస్తానని తెలిపారు. యువతని ప్రోత్సాహించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, యువత రాజకీయాల్లోకి వచ్చి, సమాజ మేలు కు తోడ్పడాలని పిలుపు నిచ్చారు.